Fri Dec 20 2024 12:34:00 GMT+0000 (Coordinated Universal Time)
Ram Charan : కొత్త క్రికెట్ టీంని అనౌన్స్ చేసిన రామ్చరణ్..
రామ్ చరణ్ తన కొత్త క్రికెట్ టీంని అనౌన్స్ చేశారు. అయితే ఆ టీం IPL కోసం కాదు, ISPLలో ఆడబోతుంది. ఇదేంటి కొత్తగా.?
Ram Charan : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఒక కొత్త క్రికెట్ టీంని తీసుకు రాబోతున్నాడంటూ గత కొంతకాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) లో ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక టీంని రామ్ చరణ్ తీసుకు రాబోతున్నాడంటూ వార్తలు వినిపించాయి. తాజాగా రామ్ చరణ్ తన కొత్త క్రికెట్ టీంని అనౌన్స్ చేశారు. అయితే ఆ టీం IPL కోసం కాదు, ISPLలో ఆడబోతుంది. ఇదేంటి కొత్తగా అనుకుంటున్నారా..?
గల్లీలో ఉండే టాలెంట్ ని ప్రోత్సహించేలా, ఆ టాలెంట్ ని దేశం మొత్తం చూపించేందుకు.. ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ISPL) అనే కొత్త క్రికెట్ లీగ్ ని తీసుకు వస్తున్నారు. ఈ లీగ్ లో గల్లీలో ఆడే సాధారణ ప్లేయర్స్ ఆడనున్నారు. ఇందుకోసం అడ్మిషన్స్ ఓపెన్ చేశారు. మీలో టాలెంట్ ఉందా, మీరు క్రికెట్ బాగా ఆడతారా.. అయితే వెంటనే ఈ అవకాశం ఉపయోగించుకోండి. మీ టాలెంట్ దేశం మొత్తం చూపించి.. భవిషత్తులో భారత జట్టులో ఆడే దిశగా ముందుకు సాగండి.
ఇక ISPLలో మొత్తం ఆరు టీంలు ఉంటాయి. హైదరాబాద్, ముంబై, బెంగళూరు, శ్రీనగర్, కోల్కత్తా, చెన్నై. ఇక ఈ ఆరు టీంస్ కి అరువురు ఓనర్స్. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ టీంకి రామ్ చరణ్ ఓనర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ విషయాన్ని రామ్ చరణ్ తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. మరి రామ్ చరణ్ టీంలో మీరు ప్లేయర్ అవ్వాలి అనుకుంటే ఈ లింక్ పై క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వండి. REGISTER NOW
అలాగే మిగిలిన టీంస్ కి కూడా పలువురు సినిమా స్టార్స్ ఓనర్స్ గా వ్యవహరిస్తున్నారు. ముంబై టీంకి అమితాబ్ బచ్చన్, బెంగళూరు టీంకి హృతిక్ రోషన్, శ్రీనగర్ టీంకి అక్షయ్ కుమార్ ఓనర్స్ గా వ్యవహరిస్తున్నారు. కోల్కత్తా, చెన్నై టీంకి సంబంధించిన ఓనర్స్ ఇంకా తెలియాల్సి ఉంది. ISPL బోర్డు ఒక్కొక్కరిగా అనౌన్స్ చేసుకుంటూ వస్తున్నారు.
Next Story