Mon Dec 23 2024 01:33:09 GMT+0000 (Coordinated Universal Time)
Ram Charan : చరణ్ పుట్టినరోజు గిఫ్ట్గా.. క్లీంకార ఫేస్ రివీల్ అయ్యిపోయింది..
రామ్ చరణ్ ఇన్నాళ్లు ఎవరికి చూపించకుండా దాచుకున్న తన ముద్దుల కూతురు ఫేస్ రివీల్ అయ్యిపోయింది.
Ram Charan : నేడు రామ్ చరణ్ పుట్టినరోజు కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో మెగా ఫ్యాన్స్ సందడి కనిపిస్తుంది. ఫ్యాన్స్ అంతా సెలబ్రేషన్స్ లో ఉంటే.. రామ్ చరణ్ తన ఫ్యామిలీతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం కోసం తిరుపతి వెళ్లారు. ఉపాసనతో పాటు ఆమె తల్లిదండ్రులు, క్లీంకార, రామ్ చరణ్ కలిసి నేడు శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొని అశీసులు తీసుకున్నారు. ఇక అందుకు సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఈ వైరల్ అవుతున్న విజువల్స్ లోనే రామ్ చరణ్ ఇన్నాళ్లు ఎవరికి చూపించకుండా దాచుకున్న తన ముద్దుల కూతురు ఫేస్ రివీల్ అయ్యిపోయింది. క్లీంకారని తీసుకోని ఉపాసన గుడిలోకి వెళ్తున్న సమయంలోమెగా వారసురాలి ఫేస్ అందరికి కనిపించేసింది. క్యూట్ గా చూస్తున్న క్లీంకారని చూసి మెగా ఫ్యాన్స్ అంతా ఫిదా అయిపోతున్నారు. ప్రస్తుతం క్లీంకార క్యూట్ లుక్స్ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి.
ఇక ఈ బర్త్ డే సెలబ్రేషన్స్ ని మరింత రెట్టింపు చేయడం కోసం.. గేమ్ ఛేంజర్ నుంచి 'జరగండి' సాంగ్ కూడా వచ్చేసింది. థమన్ మ్యూజిక్ చేసిన ఈ పాట మాస్ బీట్స్ తో సూపర్ అనిపిస్తుంది. శంకర్ విజువలైజేషన్, ప్రభుదేవా కోరియోగ్రఫీ, చరణ్ అండ్ కియారా అద్వానీ డాన్స్ మొత్తం మీద అదుర్స్ అనిపిస్తుంది. మరి ఆ సాంగ్ ని కూడా చూసేయండి.
Next Story