Fri Dec 20 2024 17:58:42 GMT+0000 (Coordinated Universal Time)
Ram Charan : 16ఏళ్ళ చిరంజీవి కలని నిజం చేసిన రామ్ చరణ్..
16ఏళ్ళ చిరంజీవి కలని నిజం చేసిన రామ్ చరణ్. అదేంటో తెలుసా..?
Ram Charan : మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా పరిచయమైన రామ్ చరణ్.. తన ఇన్నాళ్ల కెరీర్ లో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. అయితే ఇవేవి పట్టించుకోకుండా తన పనిని శ్రద్ద చేస్తూ ముందుకు వెళ్లారు. తనని విమర్శించిన వారి నుంచే ప్రశంసలు అందుకునేలా చరణ్ పని చేశారు. దీంతో నేడు చిరంజీవి కూడా అందుకొని ఎన్నో గౌరవాలు అందుకుంటూ తండ్రికి తగ్గ తనయుడు మాత్రమే కాదు, తండ్రిని మించిన తనయుడు అని కూడా అనిపించుకుంటున్నారు.
ఆర్ఆర్ఆర్ చిత్రంలో తన నటనతో నేషనల్, ఇంటర్నేషనల్ వైడ్ ఫేమ్ ని సంపాదించుకున్న రామ్ చరణ్.. రీసెంట్ గా తన తండ్రి 16ఏళ్ళ కలని నిజం చేశారు. 2007లో తెలుగు సినిమా వజ్రోత్సవం వేడుకలో చిరంజీవి వేదిక మీద మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. గోవా ఫిలిం ఫెస్టివల్ కి వెళ్లిన తనకి ఎస్వీఆర్, ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి తెలుగు నటుల ఫోటోలు అక్కడ కనిపించలేదని, తెలుగు కళాకారులకు సరైన గౌరవం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇన్నాళ్ల తరువాత ఆ ఫిలిం ఫెస్టివల్ లో తెలుగు నటుడు ఫోటో కనిపించింది. అది కూడా చిరంజీవి వారసుడు రామ్ చరణ్ ఫోటోనే కావడం విశేషం. ఈ ఏడాది జరగబోయే 54వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం వేడుకలో RRRలో అల్లూరిసీతారామరాజుగా కనిపించే రామ్ చరణ్ ఫోటో అక్కడ దర్శనమిచ్చింది. అందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. రామ్ చరణ్ తో పాటు అనుష్క శెట్టి ఫోటో కూడా అక్కడ కనిపించింది.
ఇక చరణ్ ఫోటో అక్కడ కనిపించడంతో మెగా అభిమానులు.. తండ్రి కలని నిజం చేసిన కొడుకు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా లాస్ట్ ఇయర్ 53వ ఫిలిం ఫెస్టివల్ లో 'ఇండియన్ ఫిల్మ్ పర్సనాల్టీ ఆఫ్ ది ఇయర్' అనే గౌరవని చిరంజీవి అందుకున్నారు. మరి ఈ ఏడాది తెలుగు నటులు ఎవరైనా ఈ ఫిలిం ఫెస్టివల్ లో పురస్కారం అందుకుంటారేమో చూడాలి.
Next Story