Thu Dec 19 2024 23:55:59 GMT+0000 (Coordinated Universal Time)
Ram Charan : ఈ ఇయర్ రామ్ చరణ్ బర్త్ డేకి.. ఫ్యాన్స్కి పండగే..
ఈ ఇయర్ రామ్ చరణ్ బర్త్ డేకి ఫ్యాన్స్కి పెద్ద పండగే అన్నట్లు ఉంది. గేమ్ ఛేంజర్, RC16, సుకుమార్ సినిమా నుంచి..
Ram Charan : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమాల విషయంలో ప్రస్తుతం స్పీడ్ పెరిగినట్లు కనిపిస్తుంది. ఇన్నాళ్లు నత్త నడకన నడిచిన 'గేమ్ ఛేంజర్' సినిమా.. ఇప్పుడు షెడ్యూల్ తరువాత షెడ్యూల్ ని ప్లాన్ చేసుకుంటూ ముందుకు కదులుతుంది. శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం వైజాగ్ ఆర్కే బీచ్ లో షూటింగ్ జరుపుకుంటుంది.
అక్కడ ఐదు రోజుల పాటు మూవీలోని ప్రధాన తారాగణంతో కీలక షెడ్యూల్ ని పూర్తి చేసుకోనుంది. ఈ నెల 19తో వైజాగ్ షెడ్యూల్ పూర్తి అవుతుంది. ఆ తరువాత మార్చి 21 నుంచి హైదరాబాద్ లో కొత్త షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. శరవేగంగా షూటింగ్ చేస్తూ మే లోపు చిత్రీకరణ మొత్తం పూర్తీ చేయాలని ప్లాన్ చేసినట్లు సమాచారం.
ఇది ఇలా ఉంటే, ఈ నెల 20వ తారీఖున RC16 మూవీ పూజా కార్యక్రమాలతో లాంచ్ కాబోతుందట. అలాగే మూవీ టైటిల్ ని కూడా అనౌన్స్ చేయనున్నారట. వైజాగ్ షెడ్యూల్ ని పూర్తి చేసుకొని వచ్చిన రామ్ చరణ్.. ఈ మూవీ లాంచ్ ఈవెంట్ లో పాల్గొనున్నారు. ఈ చిత్రానికి 'పెద్ది' అనే టైటిల్ ని పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి మూవీ టీం ఏ టైటిల్ ని అనౌన్స్ చేస్తుందో చూడాలి.
కాగా ఈ నెల 27న రామ్ చరణ్ పుట్టినరోజు ఉన్న సంగతి తెలిసిందే. బర్త్ డేకి వారం రోజుల ముందే RC16 అప్డేట్ వచ్చేస్తుంది. ఇక పుట్టినరోజున గేమ్ ఛేంజర్ నుంచి 'జరగండి' సాంగ్ రిలీజ్ కాబోతుంది. అలాగే అదే రోజు రామ్ చరణ్, సుకుమార్ కలయికలో తెరకెక్కే చిత్రాన్ని కూడా అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతున్నారట. దీంతో ఈ ఇయర్ బర్త్ డేకి రామ్ చరణ్ ఫ్యాన్స్కి పండగే అన్నట్లు ఉంది.
Next Story