Mon Dec 23 2024 08:12:14 GMT+0000 (Coordinated Universal Time)
2023 Rewind : గూగుల్ ఇండియా సెర్చ్‌లో 'కియారా' టాప్.. ఆమె భర్త ఏమో..
2023 పూర్తి కావొస్తుంది. మరి ఈ ఏడాది నెటిజెన్స్ గూగుల్ లో ఎక్కువుగా సెర్చ్ చేసిన వ్యక్తులు ఎవరో తెలుసుకోవాలని ఉందా..?
2023 Rewind : 2023 పూర్తి కావొస్తుంది. ఈ ఏడాది చంద్రయాన్ 3 లాంచ్, వరల్డ్ కప్, ఆస్కార్, సెలబ్రిటీస్ పెళ్లిళ్లు ఇలా చాలా అరుదైన ఈవెంట్సే జరిగాయి. దీంతో ఈ ఇయర్ గూగుల్ లో ఈ విషయాలు గురించి నెటిజెన్స్ సెర్చ్ చేస్తూ వచ్చారు. ఈక్రమంలోనే నెటిజెన్స్ గూగుల్ లో ఎక్కువుగా సెర్చ్ చేసిన వ్యక్తులు ఎవరో తెలుసుకోవాలని ఉందా..? అయితే ఈ ఆర్టికల్ చదివేయండి.
ఈ ఏడాది నెటిజెన్స్.. బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ గురించి ఎక్కువ సెర్చ్ చేశారట. ఇండియా వైడ్ గూగుల్ లో ఎక్కువ సెర్చ్ చేసిన జాబితాలో కియారా అద్వానీ మొదటి స్థానంలో ఉంటే భారత క్రికెటర్ శుభమాన్ గిల్, న్యూజిలాండ్ క్రికెటర్ రచిన్ రవీంద్ర, భారత ఆటగాడు మహమ్మద్ షమీ, ప్రముఖ ఇండియన్ యూట్యూబర్ ఎల్విష్ యాదవ్ తరువాత నాలుగు స్థానాలలో ఉన్నారు.
ఇక ఈ లిస్ట్ కియారా మొదటి స్థానాన్ని దక్కించుకుంటే ఆమె భర్త సిద్దార్థ్ మల్హోత్రా ఆరో స్థానంలో నిలిచారు. సిద్దార్థ్ కూడా బాలీవుడ్ హీరో అన్న విషయం అందరికి తెలిసిందే. ఈ ఇద్దరు కలిసి 2021లో 'షేర్షా' అనే చిత్రంలో నటించారు. ఆ సమయంలోనే ఇద్దరు ప్రేమలో పడ్డారు. పెళ్లి ముందు వరకు రహస్య ప్రేమాయణం నడిపిన వీరిద్దరూ.. ఈ ఏడాది ఫిబ్రవరి 7న ఏడడుగులు వేశారు. రాజస్థాన్ కోటలో గ్రాండ్ గా రాయల్ వెడ్డింగ్ జరుపుకున్నారు. ఇన్స్టాగ్రామ్ లో వీరి వెడ్డింగ్ ఫోటోలు ఎక్కువ లైక్స్ అందుకున్న వెడ్డింగ్ పిక్స్ గా రికార్డు క్రియేట్ చేశాయి.
కాగా కియారా అద్వానీ ఇండియన్ గూగుల్ సెర్చ్ లో మాత్రమే కాదు. గ్లోబల్ వైడ్ గూగుల్ సెర్చ్ లో కూడా స్థానం దక్కించుకున్నారు. గ్లోబల్ వైడ్ గూగుల్ సెర్చ్ చేసిన టాప్ 10 లిస్టులో కియారా.. 9వ స్థానంలో నిలిచారు. గ్లోబల్ టాప్ సెర్చ్ లో స్థానం దక్కించుకున్న ఏకైక ఇండియన్ కియారా అద్వానీ. దీంతో ఈ ఇయర్ గూగుల్ క్వీన్ గా కియారా అద్వానీ నిలిచారు.
కియారా అద్వానీ నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే.. రామ్ చరణ్, శంకర్ కంబినేషనల్ తెరకెక్కుతున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ 'గేమ్ ఛేంజర్'లో హీరోయిన్ గా నటిస్తున్నారు. అలాగే ఇండియన్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ వార్ 2లో కూడా హీరోయిన్ గా నటిస్తున్నారు. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న ఈ సినిమా 2025లో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
Next Story