Mon Dec 23 2024 01:21:05 GMT+0000 (Coordinated Universal Time)
Ram Charan : బర్త్డే నాడు రామ్చరణ్ కొత్త రికార్డు.. ఏంటంటే..!
బర్త్డే నాడు రామ్చరణ్ కొత్త రికార్డు. ఈ పుట్టినరోజు చరణ్ ఫ్యాన్స్ కి బాగా గుర్తుండి పోతుందిగా.
Ram Charan : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజుతో ఈరోజు మెగా ఫ్యాన్స్ హవా కనిపిస్తుంది. రీ రిలీజ్లు, స్పెషల్ షోలు, సాంగ్ రిలీజ్తో చరణ్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇక క్లీంకార జన్మించిన తరువాత చరణ్ చేసుకుంటున్న ఫస్ట్ బర్త్ డే కావడంతో.. మెగా ఫ్యామిలీ కూడా చాలా స్పెషల్ గా చేసుకుంటుంది. ఈక్రమంలోనే ఈరోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకొని అశీసులు తీసుకున్నారు.
కాగా ఈ బర్త్ డే రోజు చరణ్ ఓ కొత్త రికార్డుని అందుకున్నారు. ఆర్ఆర్ఆర్ తరువాత నుంచి రామ్ చరణ్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కౌంట్ లో మంచి దూకుడు చూపిస్తూ ముందుకు కదులుతున్న సంగతి తెలిసిందే. మొన్నటివరకు రామ్ చరణ్ టాప్ 3లో నిలిచారు. నాలుగు రోజుల క్రితమే టాప్ 5 టాలీవుడ్ ఇన్స్టాగ్రామ్ స్టార్స్ కి సంబంధించిన గణాంకాల రిపోర్ట్ ని తెలుగుపోస్టులో ఇచ్చాము. Click Here : Top 5 Instagram Stars Article
ఆ సమయానికి రామ్ చరణ్ 21.1 మిలియన్ ఫాలోవర్స్ తో మూడో స్థానంలో ఉన్నారు. మొదటి రెండు స్థానాల్లో.. అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ ఉన్నారు. ఇప్పుడు విజయ్ ని బీట్ చేసి రామ్ చరణ్ సెకండ్ ప్లేస్ ని సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ ఇన్స్టా ఫాలోవర్స్ కౌంట్ 21.7 మిలియన్స్ కి చేరింది. అల్లు అర్జున్ 25 మిలియన్స్ ఫాలోవర్స్ తో మొదటి స్థానంలో ఉన్నారు. చరణ్ స్పీడ్ చూస్తుంటే.. త్వరలో అది కూడా క్రాస్ చేసేటట్టు ఉన్నారు. ఈ గణాంకా సమాచారం 2024 మార్చి 27 వరకు ఉన్న ఫాలోవర్స్ బట్టి ఇచ్చింది.
కాగా ఈ బర్త్ డే రోజు చరణ్ ఫ్యాన్స్ ని మరో అదృష్టం కూడా వరించింది. ఇన్నాళ్లు రామ్ చరణ్ దాచుకున్న తన ముద్దుల కూతురు ఫేస్.. తిరుమల దేవస్థానంలో యాక్సిడెంటల్ గా రివీల్ అయ్యిపోయింది. ఇది దైవ నిర్ణయమే అనుకోవాలి. ఎందుకంటే తిరుపతి వంటి పుణ్యక్షేత్రంలో, అది చరణ్ పుట్టినరోజు నాడు కనిపించడం నిజంగా విశేషమే కదా. మరి చరణ్ అండ్ ఉపాసన.. క్లీంకార ఫుల్ పిక్చర్ ని ఇప్పటికి అయినా రివీల్ చేస్తారో లేదో చూడాలి.
Next Story