Mon Dec 23 2024 01:11:32 GMT+0000 (Coordinated Universal Time)
Ram Charan : వైజాగ్ బీచ్లో కూతురితో ఆడుకుంటున్న రామ్చరణ్..
వైజాగ్ బీచ్లో కూతురితో ఆడుకుంటున్న రామ్చరణ్ వీడియోని షేర్ చేసిన ఉపాసన.
Ram Charan : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ గత ఐదు రోజుల నుంచి వైజాగ్ బీచ్ ఒడ్డున 'గేమ్ ఛేంజర్' షూటింగ్ చేస్తూ సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే చరణ్ నటుడిగా ఒక పక్క తన షూటింగ్ ని ముందుకు నడిపించుకుంటూ వెళ్తూనే.. మరో పక్క ఫ్యామిలీతో కూడా ఎంజాయ్ చేస్తూ వచ్చారు. తన కూతురు క్లీంకారతో కలిసి వైజాగ్ సముద్రంలో సూర్యోదయం చేస్తూ ఎంజాయ్ చేసారు.
ఇందుకు సంబంధించిన వీడియోని ఉపాసన తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసారు. ఆ వీడియోలో ఉపాసన, రామ్ చరణ్, క్లీంకార, తమ కుక్కపిల్ల రైమ్ కనిపిస్తున్నారు. చరణ్ తన ముద్దుల కూతురు క్లీంకారకి సముద్రాన్ని, చేపలను చూపిస్తూ తాను చిన్నపిల్లాడిలా మారిపోయి ఎంజాయ్ చేసారు. ఈ వీడియో అభిమానులతో పాటు ప్రతి ఒక్కర్ని ఆకట్టుకుంటుంది. వీడియో చూసిన ప్రతిఒక్కరు.. లవ్ సింబల్స్తో ఫ్యామిలీ గోల్స్ అంటూ కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. మరి ఆ బ్యూటిఫుల్ వీడియోని మీరు కూడా చూసేయండి.
కాగా ఇవాళటితో వైజాగ్ లోని గేమ్ ఛేంజర్ షూటింగ్ పూర్తి అయింది. ఈ నెల 21 నుంచి మళ్ళీ హైదరాబాద్ లో కొత్త షెడ్యూల్ మొదలు కానుంది. ఇక రేపు మార్చి 20న ఏమో RC16 ఓపెనింగ్ ఈవెంట్ జరగబోతుంది. బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి 'పెద్ది' అనే టైటిల్ ని పెట్టినట్లు న్యూస్ వస్తుంది. మరి రేపు ఇదే టైటిల్ ని అనౌన్స్ చేస్తారా లేదా అనేది చూడాలి. జాన్వీ కపూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు.
Next Story