Sat Nov 23 2024 00:43:27 GMT+0000 (Coordinated Universal Time)
Ram Charan : ఇంటర్నేషనల్ అవార్డుని గెలుచుకున్న రామ్ చరణ్..
'ఆర్ఆర్ఆర్' సినిమాతో ఇంటర్నేషనల్ లెవెల్ లో పాపులారిటీని సంపాదించుకున్న రామ్ చరణ్.. తాజాగా ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ అవార్డుని అందుకున్నారు.
Ram Charan : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ 'ఆర్ఆర్ఆర్' సినిమాతో ఇంటర్నేషనల్ లెవెల్ లో మంచి పాపులారిటీని సంపాదించుకున్నారు. ఆ మధ్య ప్రముఖ అంతర్జాతీయ అవార్డుల వేడుకలో ప్రెజెంటర్ గా వెళ్లి అరుదైన గౌరవం అందుకున్నారు. తాజాగా అమెరికాలో నిర్వహించే పాప్ ప్రతిష్టాత్మకమైన పాప్ గోల్డెన్ అవార్డ్స్ లో బెస్ట్ యాక్టర్ గా అవార్డుని సొంతం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆ అవార్డు కమిటీ సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది.
అమెరికాలో నిర్వహించే ఈ అవార్డుల్లో ఇండియా తరుపు నుంచి బాలీవుడ్ యాక్టర్స్ కి అవార్డులు ఇస్తూ ఉంటారు. ఇక ఈ ఏడాది కూడా బాలీవుడ్ యాక్టర్స్ లిస్టులో రామ్ చరణ్ తో పాటు షారుఖ్ ఖాన్, విశేష్ బన్సల్, అర్జున్ మాథుర్, దీపికా పదుకొనే, రాశి ఖన్నా, అదా శర్మ, రిద్ధి డోగ్రా నామినేషన్స్ లో ఉన్నారు. వీరిలో రామ్ చరణ్ ఆ అవార్డుని కైవసం చేసుకున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ అభిమానులు ఈ విషయాన్ని వైరల్ చేస్తున్నారు.
ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో 'గేమ్ ఛేంజర్' సినిమా చేస్తున్నారు. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ 80 శాతం పూర్తి అయ్యింది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా అంజలి, శ్రీకాంత్, సునీల్, ఎస్ జె సూర్య తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ఫిబ్రవరి 2024 లోపు పూర్తి అవుతుందని చెబుతున్నారు.
ఈ సినిమా తరువాత బుచ్చిబాబుతో చేయబోయే RC16 ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా కథాంశం ఉత్తరాంధ్ర ప్రాంతంలో జరగనుందట. దీంతో ఆ ఏరియా స్లాంగ్ లో మాట్లాడేవారు కావాలంటూ ఇటీవల ఆడిషన్ కాల్ కూడా ప్రకటించారు. ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. హీరోయిన్ గా సాయి పల్లవిని అనుకుంటున్నట్లు సమాచారం.
Next Story