Mon Dec 23 2024 03:06:33 GMT+0000 (Coordinated Universal Time)
వరుణ్ తేజ్.. హాలీవుడ్ కటౌట్ కు అలాంటి సినిమానే..!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న స్పై యాక్షన్ త్రిల్లర్ మూవీ గాండీవధారి అర్జున. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్న
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న స్పై యాక్షన్ త్రిల్లర్ మూవీ గాండీవధారి అర్జున. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా.. ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా నుండి టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఫుల్ యాక్షన్ తో నిండి ఉంది ఈ సినిమా..! యాక్షన్ సీక్వెన్సెస్ కూడా చాలా కొత్తగా డిజైన్ చేశారు. మెగా హీరో వరుణ్ తేజ్ కూడా తన కటౌట్ కు తగ్గ కంటెంట్ తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. మిక్కీ జె మేయర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించాడు. సాక్షి వైద్య(Sakshi vaidhya) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను ఎస్వీసీసీ బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.
వరుణ్ తేజ్ ఈ సినిమా తర్వాత.. పలాస మూవీ దర్శకుడు కరుణకుమార్ డైరెక్షన్ లో ఓ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ మూవీ 1960 నేపథ్యంలో జరిగిన వాస్తవ సంఘటనలను బేస్ చేసుకొని తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. 1960 గ్రామాల్లోని వాతావరణాన్ని సృష్టించేందుకు ఆర్ట్ టెక్నిషన్స్ ని రంగంలో దింపుతున్నారు. ఈ నెల జూలై 27న గ్రాండ్‌గా మూవీ లాంఛ్ కానుందని సమాచారం. హీరోయిన్గా మీనాక్షి చౌదరి ఎంపిక కాగా.. వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి (సివిఎం), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల ఈ మూవీను నిర్మించనున్నారు.
Next Story