Mon Dec 23 2024 04:05:09 GMT+0000 (Coordinated Universal Time)
గణేష్ ఉత్సవాలకు 'భగవంత్ కేసరి' రెడీ చేసిన గణేష్ యాంతం వచ్చేసింది..
బాలకృష్ణ భగవంత్ కేసరి నుంచి ఫస్ట్ సింగల్ రిలీజ్ అయ్యింది. గణేష్ ఉత్సవాల్లో బాలయ్య గణేష్ యాంతం..
నటసింహ బాలకృష్ణ (Balakrishna) ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో తన 108వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. 'భగవంత్ కేసరి' (Bhagavanth Kesari) అనే టైటిల్ ని పెట్టుకున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) హీరోయిన్ గా చేస్తుంటే, మరో హీరోయిన్ శ్రీలీల (Sreeleela) బాలకృష్ణకు కూతురిగా కనిపించబోతుందని తెలుస్తుంది.
గతంలో ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన గ్లింప్స్ ఆడియన్స్ లో మంచి అంచనాలే క్రియేట్ చేసింది. ఇక వచ్చే నెల విడుదల ఉండడంతో ఇప్పటి నుంచే ప్రమోషన్స్ మొదలు పెట్టారు. ఈక్రమంలోనే సినిమాలోని మొదటి సాంగ్ ని రిలీజ్ చేశారు. ‘గణేష్ యాంతం’ అనే ఈ పాటను గణేష్ ఉత్సవాలు నేపథ్యంతో తెరకెక్కించారు. థమన్ ఈ పాటని కంపోజ్ చేయగా కాసర్ల శ్యామ్ లిరిక్స్, మనీష్ పండ్రంకి అండ్ కరీముల్లా గానం చేశారు.
గ్రాండ్ మేకింగ్ తో శేఖర్ మాస్టర్ ఈ పాటకి డాన్స్ కోరియోగ్రఫీ చేశాడు. ఇక ఈ సాంగ్ ని బాలయ్య, శ్రీలీల తమ ఎనర్జీతో ఎక్కడికో తీసుకువెళ్లిపోయారు. సాంగ్ లో వీరిద్దరి ఎనర్జీ చూస్తుంటే ప్రతి ఒక్కరు తీన్మార్ ఆడాల్సిందే. కేవలం లిరికల్ సాంగ్ తోనే ఆడియన్స్ ని ఉర్రూతలూగించిన బాలయ్య.. థియేటర్ లో ఫుల్ సాంగ్ తో పూనకాలు తెప్పించడం ఖాయం అని తెలుస్తుంది. మరి ఆ సాంగ్ ని ఒకసారి మీరుకూడా చూసేయండి.
కాగా ఈ చిత్రాన్ని హరీష్ పెద్ది, సాహు గారపాటి షైన్ స్క్రీన్స్ పతాకం పై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. బాలీవుడ్ యాక్టర్ అర్జున్ రాంపాల్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు. దసరా పండుగకు అక్టోబర్ 19న ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నారు. ఇక అఖండ, వీర సింహరెడ్డి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ 100 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టిన బాలకృష్ణ.. ఈ చిత్రంతో కూడా ఆ క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చి హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ అందుకోవాలని చూస్తున్నాడు.
Next Story