Tue Nov 05 2024 14:46:20 GMT+0000 (Coordinated Universal Time)
పుష్ప సినిమా పై గరికపాటి ఫైర్.. "తగ్గేదే లే" ఏంటి ?
ఇటీవల ఓ ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో.. పుష్ప సినిమాపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు గరికపాటి. తనకూ సినిమాల గురించి తెలుసని
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా పుష్ప - ది రైజ్. తెలుగు సహా.. పలు భాషల్లో విడుదలైన ఈ సినిమా ఊహించని వసూళ్లు రాబట్టింది. బాలీవుడ్ లో ఈ సినిమా రూ.100 కోట్ల క్లబ్ లోకి చేరి.. దక్షిణాది సినిమాల పవరేంటో చూపింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ ఎర్రచందనం స్మగ్లర్ గా నటించగా.. అతను చెప్పిన "తగ్గేదే లే" డైలాగ్ బాగా పాపులర్ అయింది. అయితే.. ఈ సినిమాపై ప్రముఖ ప్రవచనకర్త, సహస్రావధాని గరికపాటి నరసింహారావు మండిపడ్డారు. ఆ సినిమాలోని "తగ్గేదే లే" డైలాగ్ తనకు ఏమాత్రం నచ్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read : అమ్మాయిగారి అకౌంట్ హ్యాక్ అయిందట
ఇటీవల ఓ ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో.. పుష్ప సినిమాపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు గరికపాటి. తనకూ సినిమాల గురించి తెలుసని.. పుష్ప సినిమాలో హీరోను స్మగ్లర్ గా చూపించి.. చివరి ఐదు నిమిషాల్లో హీరోను మంచిగా చూపిస్తామనో లేదా రెండో పార్టులో మంచిగా చూపిస్తామనో అంటారని.. రెండో పార్ట్ వచ్చేలోపు సమాజం చెడిపోదా? అని ప్రశ్నించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ.. "తగ్గేదే లే" అనడం ఏంటి ? అని ప్రశ్నించారు. ఓ కుర్రాడు ఎవరినైనా గూబమీద కొట్టి తగ్గేదే లే అంటున్నాడని, దీనికి కారణం ఎవరు అని ప్రశ్నించారు. ఈ డైలాగ్ తనకు కోపం తెప్పిస్తోందని, ఇలాంటి వాటి వల్ల సమాజంలో నేరాలు పెరిగిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి డైలాగ్ ను శ్రీరాముడు, హరిశ్చంద్రుడు వంటివారు వాడాలని.. అంతేకానీ, ఒక స్మగ్లర్ ఎలా వాడతాడని విమర్శించారు.
News Summary - Garikapati Narasimha Rao Fires on Pushpa Movie
Next Story