Mon Dec 23 2024 11:33:23 GMT+0000 (Coordinated Universal Time)
మహేష్ బాబు బాటలోనే వారసులు కూడా..
మహేష్ బాబు లాగానే తన వారసులు గౌతమ్, సితార చిన్నవయసు నుంచే తండ్రి బాటలో పయనించి అభిమానులను సంతోష పరుస్తున్నారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) తన సినిమాల్లో సమాజానికి ఉపయోగపడేలా సోషల్ మెసేజ్ ఇవ్వడమే కాదు, నిజ జీవితంలో కూడా సోషల్ సర్వీస్ చేస్తూ రియల్ మహర్షి అనిపించుకుంటాడు. మహేష్ బాబు ఫౌండేషన్ (Mahesh Babu Foundation) ద్వారా ఎన్నో సేవాకార్యక్రమాలు చేస్తుంటాడు. మరి ముఖ్యంగా గుండె సమస్యతో బాధపడుతున్న పేద పిల్లలకు ఉచితంగా చికిత్స చేయించి వారి గుండె చప్పుడు అయ్యిపోతున్నాడు.
ఇప్పటికే 1000 మందికి పైగా ఫ్రీగా చికిత్స చేయించిన మహేష్ ఆ సర్వీస్ ని అలానే ముందుకు తీసుకు వెళ్తున్నాడు. ఇక మహేష్ వారసులు అయిన గౌతమ్ (Gautam), సితార (Sitara) కూడా చిన్నతనం నుంచే తండ్రి బాటలో అడుగులు వేస్తూ అభిమానులను సంపాదించుకుంటున్నారు. ప్రముఖ రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్స్ తో MB ఫౌండేషన్స్ కలిసి పని చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ హాస్పిటల్ లో ఆంకాలజి, కార్డియో వార్డుల్లో MB ఫౌండేషన్ ద్వారా చికిత్స పొందుతున్న పిల్లలను గౌతమ్ అప్పుడప్పుడు కలిసి వారితో మాట్లాడాలి, వాళ్లకి ధైర్యంతో పాటు కొన్ని బహుమతులు కూడా ఇస్తాడట.
ఈక్రమంలోనే తాజాగా గౌతమ్ రెయిన్బో హాస్పిటల్ కి వచ్చి.. అక్కడి చికిత్స పొందుతున్న పిల్లల ముఖాల్లో నవ్వులు నింపాడు. ఇక ఈ విషయాన్ని MB ఫౌండేషన్ తమ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియజేసింది. ఈ పోస్ట్ చూసిన మహేష్ అభిమానులు, నెటిజెన్స్ గౌతమ్ ని అభినందిస్తున్నారు. కాగా ఇటీవల సితార ఒక యాడ్ లో నటించగా.. దానికి వచ్చిన రెమ్యూనరేషన్ మొత్తాన్ని ట్రస్ట్ కి ఇచ్చేసింది. ఆ తరువాత తన పుట్టినరోజుని కూడా సేవా కార్యక్రమంతోనే జరుపుకుంది.
పాఠశాలకు నడిచి వెళ్తున్న కొంతమంది పేద విద్యార్థినిలకు సైకిల్ పంపకం చేసింది. ఇలా వారసులు ఇద్దరు చిన్నవయసు నుంచే మహేష్ బాబు బాటలోనే పయనించడం అభిమానులను సంతోష పరుస్తుంది. ఇక మహేష్ బాబు సినిమాలు విషయానికి వస్తే.. ప్రస్తుతం 'గుంటూరు కారం' (Guntur Kaaram) చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ లేట్ అయిన సంగతి తెలిసిందే. అయితే వచ్చే ఏడాది సంక్రాంతికి కచ్చితంగా రిలీజ్ చేయాలనీ చిత్ర యూనిట్ శరవేగంగా చిత్రీకరణ జరుపుతున్నారు.
Next Story