Mon Dec 23 2024 11:29:00 GMT+0000 (Coordinated Universal Time)
Big Boss 7 : గౌతమ్ కృష్ణ ఎంత సంపాదించాడు..?
13వ వారం ఎలిమినేట్ అయిన గౌతమ్ కృష్ణ.. బిగ్బాస్ హౌస్ నుంచి ఎంత రెమ్యూనరేషన్ ఇంటికి తీసుకోని వెళ్ళాడు.
BigBoss 7 : తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్బాస్ సీజన్ 7 ఫైనల్ కి చేరుకుంది. 13వ వారం పూర్తి చేసుకున్న ఈ సీజన్ మరో వారంలో ఫినాలే వేదిక పై విన్నర్ ని తెలియజేయనుంది. గత వారం ఎలిమినేషన్ తో ఎనిమిది కంటెస్టెంట్స్ హౌస్ లో మిగిలారు. ఇక ఈ వారం ఎలిమినేషన్ లో మరో కంటెస్టెంట్ బయటకి వచ్చేశాడు. డాక్టర్ కమ్ యాక్టర్ అయిన గౌతమ్ కృష్ణ.. ఈ వీక్ ఎలిమినేట్ అయ్యి బయటకి వచ్చేశాడు.
పెద్దగా ఆడియన్స్ కి పరిచయం లేని గౌతమ్.. అపరిచితుడు గానే హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి ఒంటరిగానే ఆడుతూ వచ్చాడు. ఆ మధ్య ఒక రోజు సీక్రెట్ రూంలో ఉండి.. అశ్వద్ధామ 2.0 అంటూ బయటకి వచ్చి సందడి చేసినా పెద్దగా ఆడియన్స్ ని ఆకట్టుకున్నది లేదు. హౌస్ లో ఇన్నాళ్లు జరిగిన టాస్క్ ల్లో కూడా గౌతమ్ పెద్దగా గెలిచినా దాఖలాలు లేవు. అయినాసరి ఇన్నాళ్లు హౌస్ లో రాణించాడు అంటే గొప్ప విషయమే.
కాగా 13 వారలు హౌస్ లో ఉన్న గౌతమ్ కృష్ణ ఎంత సంపాదించాడో తెలుసా..? పెద్దగా ఆడియన్స్ కి తెలియని గౌతమ్ హౌస్ లోకి వారానికి 1.5 లక్షల రూపాయిల రెమ్యునరేషన్ చొప్పున ఎంట్రీ ఇచ్చినట్లు సమాచారం. దీని బట్టి చూస్తే.. గౌతమ్ 13 వారాలకు గాను దాదాపు రూ.19.5 లక్షల రెమ్యూనరేషన్ అందుకున్నట్లు తెలుస్తుంది. ఏదేమైనా ఎలాంటి గుర్తింపు లేకుండా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన గౌతమ్ సింగల్ గా ఆడుతూ ఆల్మోస్ట్ చివరి వరకు రావడం గ్రేట్ అనే చెప్పాలి.
ఇక ఈ వారం ఎలిమినేషన్స్ పూర్తి అయ్యిపోగా ప్రస్తుతం హౌస్ లో శివాజీ, ప్రశాంత్, యావర్, అమర్, అర్జున్, శోభాశెట్టి, ప్రియాంక కంటెస్టెంట్స్ మిగిలారు. వీరిలో టికెట్ టు ఫినాలే రేసులో విజేతగా నిలిచి అర్జున్ తొలి ఫైనలిస్ట్ గా ఫైనల్స్ కి చేరుకున్నాడు. మరి ఈ వారం కూడా మరికొన్ని టాస్క్ లతో మరో ఫైనలిస్ట్ ని కూడా ఎంపిక చేస్తారేమో చూడాలి. అలాగే ఈసారి టైటిల్ ని ఎవరు గెలుచుకుంటారో అని అందరిలో ఆసక్తి నెలకుంది.
Next Story