Mon Dec 23 2024 05:20:01 GMT+0000 (Coordinated Universal Time)
జెనీలియా రీ ఎంట్రీ..
పెళ్లి తర్వాత జెనీలియా సినిమాలకు దూరమైంది. సంసార బాధ్యతలు, పిల్లల బాధ్యతలతో 10 ఏళ్ల పాటు సినీ రంగానికి దూరమైన జెనీలియా.. ఇప్పుడు తెలుగులో..
హైదరాబాద్ : అందం, అల్లరి, చిలిపిదనం, చలాకీతనం, కాస్త అమాయకత్వం.. ఇవన్నీ కలగలిపిన హీరోయిన్ జెనీలియా. తెరపై అందాలతో కనువిందు చేసే హీరోయిన్లు చాలా మంది ఉన్నారు కానీ.. జెనీలియా లాగా అల్లరిచేసిన హీరోయిన్లు లేరనే చెప్పాలి. తెలుగు, తమిళ భాషల్లో ఎక్కువ సినిమాలు చేసిన జెనీలియా.. మలయాళం, కన్నడ, హిందీ, మరాఠీ సినిమాల్లోనూ మెరిసింది. తెలుగులో జెనీలియా నటించిన సై, హ్యాపీ, బొమ్మరిల్లు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. బొమ్మరిల్లులో హాసిన క్యారెక్టర్ జెనీలియాకు మంచి ఫేమ్ ను తీసుకొచ్చింది. ఇప్పటికీ హాసినిని మరచిపోలేదు తెలుగు ప్రేక్షకులు.
Also Read : ఆడవాళ్లు మీకు జోహార్లు రివ్యూ
పెళ్లి తర్వాత జెనీలియా సినిమాలకు దూరమైంది. సంసార బాధ్యతలు, పిల్లల బాధ్యతలతో 10 ఏళ్ల పాటు సినీ రంగానికి దూరమైన జెనీలియా.. ఇప్పుడు తెలుగులో రీ ఎంట్రీ ఇవ్వనుంది. రాధాకృష్ణ దర్శకత్వంలో వారాహి సంస్థ నిర్మిస్తున్న సినిమాలో గాలి జనార్థన్ రెడ్డి కొడుకు కిరీటి హీరోగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా.. జెనీలియా ముఖ్య పాత్ర పోషిస్తోంది. దర్శకుడు రాజమౌళి క్లాప్ తో ఈ సినిమా నిన్ననే మొదలైంది. తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఫిక్స్ కాలేదు.
Next Story