Mon Dec 23 2024 16:18:27 GMT+0000 (Coordinated Universal Time)
రమేష్ బాబు అంత్యక్రియలపై.. ఘట్టమనేని ఫ్యామిలీ విన్నపం !
రమేష్ బాబు అంత్యక్రియల విషయమై ఘట్టమనేని వారి కుటుంబం తరపున నిర్మాత బీ.ఏ రాజు సోషల్ మీడియాలో ఓ విన్నపాన్ని షేర్ చేశారు.
సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కొడుకు, మహేష్ బాబు సోదరుడు.. ఒకప్పటి టాలీవుడ్ హీరో అయిన రమేష్ బాబు శనివారం రాత్రి అనారోగ్యంతో మృతిచెందారు. కొద్దిరోజులుగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం.. గతరాత్రి మరింత విషమించడంతో కుటుంబ సభ్యులు ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే రమేష్ బాబు మృతి చెందడంతో.. ఘట్టమనేని కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Also Read : రమేష్ బాబు మృతి పట్ల ప్రముఖుల సంతాపం
రమేష్ బాబు మృతిపట్ల టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. కాగా.. మహేష్ బాబుకు ఇటీవలే కరోనా నిర్థారణ కావడంతో.. సోదరుడి ఆఖరి చూపుకి కూడా నోచుకోలేని పరిస్థితి. ఇదిలా ఉండగా.. రమేష్ బాబు అంత్యక్రియల విషయమై ఘట్టమనేని వారి కుటుంబం తరపున నిర్మాత బీ.ఏ రాజు సోషల్ మీడియాలో ఓ విన్నపాన్ని షేర్ చేశారు. "ఆయన మరణానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాము. ఆయన ఎప్పటికీ మన హృదయాల్లో నిలిచిపోతారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, మా శ్రేయోభిలాషులందరినీ కోవిడ్ నిబంధనలకు కట్టుబడి, దహన సంస్కారాల స్థలంలో గుమికూడకుండా ఉండాలని మేము అభ్యర్థిస్తున్నాము. ఇట్లు.. ఘట్టమనేని కుటుంబం" అని పేర్కొంటూ.. బీఏ రాజు ఓ పోస్ట్ ను షేర్ చేశారు.
News Summary - Ghattamaneni family's request on Ramesh Babu's funeral
Next Story