Mon Dec 23 2024 07:48:29 GMT+0000 (Coordinated Universal Time)
Prasanth Varma : హనుమాన్ దర్శకుడు లేడీ ఓరియంటెడ్ మూవీలో ఆమె హీరోయిన్..
హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ తీయబోయే లేడీ ఓరియంటెడ్ సూపర్ హీరో మూవీ 'మహాకాళి'లో ఆమెనట హీరోయిన్.
Prasanth Varma : హనుమాన్ సినిమాతో టాలీవుడ్ టు బాలీవుడ్ సెన్సేషన్ అయిన దర్శకుడు 'ప్రశాంత్ వర్మ'. ఈ హనుమాన్ మూవీతో ప్రశాంత్ వర్మ.. ఓ సూపర్ హీరో సినిమాటిక్ యూనివర్స్ ని క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ యూనివర్స్ లో మొత్తం 12 సూపర్ హీరో సినిమాలు రాబోతున్నాయి. హనుమాన్ తరువాత 'అధీర', 'జై హనుమాన్' రాబోతున్నాయి. ఆ నెక్స్ట్ ఓ లేడీ ఓరియంటెడ్ సూపర్ హీరో మూవీ 'మహాకాళి' రాబోతుంది.
ఈ లేడీ సూపర్ హీరో సినిమాలో నటించబోయే హీరోయిన్ ఎవరు అన్నది మాత్రం దర్శకుడు తెలియజేయలేదు. అయితే ఆ మూవీలో నటించబోయే హీరోయిన్ ఎవరో.. ఓ హింట్ దొరికేసింది. చిన్న సినిమాల్లో హీరోయిన్గా, బడా ప్రాజెక్ట్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ.. తన యాక్టింగ్ తో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి 'జ్ఞానేశ్వరి కాండ్రేగుల'. రీసెంట్ గా నాగచైతన్య నటించిన 'దూత' వెబ్ సిరీస్ లో కూడా జ్ఞానేశ్వరి ముఖ్య పాత్ర పోషించారు.
జ్ఞానేశ్వరి రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఆమె ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటని ప్రశ్నించగా.. "దూత 2 ఉంది. అలాగే ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఒక లేడీ ఓరియంటెడ్ మూవీ చేస్తున్నాను" అంటూ చెప్పుకొచ్చారు. దీంతో ఆ 'మహాకాళి' సూపర్ హీరో సినిమాలో జ్ఞానేశ్వరినే నటించబోతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం జ్ఞానేశ్వరికి సంబందించిన ఇంటర్వ్యూ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
Next Story