Mon Dec 23 2024 03:46:19 GMT+0000 (Coordinated Universal Time)
ఓటీటీలోకి వచ్చేసిన గాడ్ ఫాదర్, సర్దార్
గాడ్ ఫాదర్ ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటిటి సంస్థ ‘నెట్ ఫ్లిక్స్’ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. నేటి (నవంబర్ 19) నుండి..
మలయాళ సినిమా లూసిఫర్ కి రీమేక్ గా.. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో, నయనతార, సత్యదేవ్, మురళీ శర్మ కీలక పాత్రల్లో.. సల్మాన్ ఖాన్ ప్రత్యేక పాత్రలో వచ్చిన సినిమా గాడ్ ఫాదర్. దసరా కానుకగా అక్టోబర్ 5న విడుదలైన ఈ సినిమా.. చిరంజీవికి మరో హిట్ తెచ్చిపెట్టింది. పొలిటికల్ బ్యాగ్రౌండ్ తో.. సీఎం సీటు చుట్టూ జరిగే కథగా తెరకెక్కిన ఈ సినిమా.. ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు బాగానే రాబట్టింది. థియేటర్లలో లాంగ్ రన్ పూర్తి చేసుకున్నఈ సినిమా నేటి నుండి ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది.
గాడ్ ఫాదర్ ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటిటి సంస్థ 'నెట్ ఫ్లిక్స్' సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. నేటి (నవంబర్ 19) నుండి ఈ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. కాగా, ఈ చిత్రాన్ని సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్పై నిర్మాత ఆర్.బీ చౌదరి నిర్మించగా.. తమన్ సంగీతబాణీలు స్వరపరిచాడు. దర్శకుడు పూరి జగన్నాధ్ కూడా ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో కనిపించాడు.
అక్టోబర్ 21న విడుదలైన సర్దార్ కూడా ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది. కార్తీ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాకి పిఎస్ మిత్రన్ దర్శకత్వం వహించారు. రాశి ఖన్నా, రజిషా విజయన్ కథానాయికలుగా నటించారు. తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ మూవీ స్పై యాక్షన్ థ్రిల్లర్గా రూపొందింది. నవంబర్ 18 నుండి సర్దార్ ఆహా లో స్ట్రీమ్ అవుతోంది.
Next Story