Mon Dec 23 2024 03:54:04 GMT+0000 (Coordinated Universal Time)
ఓటీటీలోకి వచ్చేస్తున్న గాడ్ ఫాదర్..
తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా కథలో కొన్ని మార్పులు చేయడంతో ఈ సినిమా తెలుగు ఆడియన్స్ కు బాగా కనెక్టయింది. తమన్ అందించిన..
మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ సినిమా 'గాడ్‌ఫాదర్'. దసరా కానుకగా విడుదలైన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. మలయాళ మూవీ లూసిఫర్ కు రీమేక్ గా.. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిందీ చిత్రం. సీఎం సీటు చుట్టూ జరిగే కథగా చూపించిన ఈ సినిమాలో నయనతార, సత్యదేవ్, సునీల్, షఫీ, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రల్లో నటించగా.. సల్మాన్ ఖాన్ గెస్ట్ గా నటించారు. ఈ సినిమాలో చిరు సరికొత్త లుక్‌లో కనిపించడంతో ఈ సినిమాను చూసేందుకు అభిమానులు ఆసక్తిని చూపారు.
తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా కథలో కొన్ని మార్పులు చేయడంతో ఈ సినిమా తెలుగు ఆడియన్స్ కు బాగా కనెక్టయింది. తమన్ అందించిన మ్యూజిక్ సినిమాకు మరో బలంగా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద మెగాస్టార్ కు మంచి సక్సెస్ ను అందించిన గాడ్ ఫాదర్.. ఓటీటీ విడుదలకు రెడీ అవుతోంది. ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌పాం నెట్‌ఫ్లిక్స్ గాడ్‌ఫాదర్ సినిమా డిజిటల్ రైట్స్‌ను దక్కించుకుంది. ఈ సినిమాను నవంబర్ 19న స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు నెట్‌ఫ్లిక్స్ తాజాగా వెల్లడించింది. ఓటీటీ నుంచి గాడ్ ఫాదర్ కు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో తెలియాలంటే.. మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
Next Story