Mon Dec 23 2024 09:04:23 GMT+0000 (Coordinated Universal Time)
గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడంటే..?
తాజాగా చిత్ర యూనిట్ గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా ప్రకటించింది.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం 'గాడ్ ఫాదర్'. ఈ చిత్రంలో చిరంజీవితో పాటు సల్మాన్ ఖాన్ కూడా కీలక పాత్రలో నటించడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. నయనతార, సత్య దేవ్, సునీల్, సముద్రఖని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ పతాకాలపై ఆర్.బి.చౌదరి, ఎన్వి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని కొణిదెల సురేఖ సమర్పిస్తున్నారు. సురేష్ సెల్వరాజన్ కళా దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి నీరవ్ షా కెమెరా మెన్ గా పని చేశారు. బాస్ ఈ సినిమాను నిశ్శబ్ద విస్ఫోటం అని చెప్పడంతో అంచనాలు భారీగా ఉన్నాయి.
తాజాగా చిత్ర యూనిట్ గాడ్ ఫాదర్ చిత్ర బృందం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా ప్రకటించింది. ఈ నెల 28న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరపాలని నిర్ణయించింది. అనంతపురంను వేదికగా ఎంచుకోవడం విశేషం. ఈ బుధవారం నగరంలోని ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుందని చిత్ర బృందం తెలిపింది. ఈ నెల 27, 28 తేదీల్లో గాడ్ ఫాదర్ ఈవెంట్ నిర్వహిస్తారు. క్లాక్ టవర్ వద్ద ఉన్న ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్‌ను వినియోగించుకునేందుకు అనుమతులు పొందారు. 27వ తేదీన సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను ఏర్పాటు చేస్తారు. 28వ తేదీ సాయంత్రం 5 గంటలకు చిరంజీవి, పలువురు సినీ ప్రముఖులు అనంతపురానికి రానున్నారు.
Next Story