Mon Dec 23 2024 03:13:45 GMT+0000 (Coordinated Universal Time)
నయనతార గురించి కీలక వ్యాఖ్యలు చేసిన గాడ్ ఫాదర్ నిర్మాత
సత్యప్రియ క్యారెక్టర్ లో.. నయనతార చిరంజీవికి చెల్లెలి పాత్రలో కనిపించింది
మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా మంచి హిట్ ను సంపాదించుకుంది. ఈ సినిమాలో చిరంజీవి తర్వాత అద్భుతమైన పెర్ఫార్మెన్స్ లు చేసిన వారిలో సత్య దేవ్, నయనతార ఉన్నారు. సత్యదేవ్.. ఈ సినిమాలో జైదేవ్ అనే పాత్రలో కనిపించి మెప్పించాడు. ముఖ్యమంత్రి సీట్ ను సంపాదించుకునేందుకు అతడు చెప్పే డైలాగ్స్ లో మంచి ఇంపాక్ట్ ఉంది. ఇక నయనతార కూడా కీలక పాత్రలో కనిపించింది. సత్యప్రియ క్యారెక్టర్ లో కనిపించిన నయనతార చిరంజీవికి చెల్లెలి పాత్రలో కనిపించింది. సినిమా సక్సెస్ లో వీరిది కూడా భాగమేనని అంటున్నారు.
తాజాగా 'గాడ్ ఫాదర్' నిర్మాత ఎన్వీ ప్రసాద్ నయనతారపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమెను ఎంతో పొగిడారు. నయనతార ఎంతో బిజీ .. అయినా చిరంజీవిగారి పట్ల ఆమెకి గల గౌరవభావం, మోహన్ రాజా పట్ల గల అభిమానం కారణంగా 'గాడ్ ఫాదర్' చేయడానికి ఒప్పుకున్నారని ప్రసాద్ చెప్పుకొచ్చారు. సినిమా అంగీకరించిన దగ్గర నుంచి ఎంతో క్రమశిక్షణతో ఆమె తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోయారు. ఆమె అంకితభావాన్ని అభినందించకుండా ఉండటం కష్టమని అన్నారు. ముఖ్యంగా ఏ రోజున కూడా ఆమెగానీ .. ఆమె టీమ్ గాని డబ్బు గురించిన ప్రస్తావన తీసుకుని రాలేదని అన్నారు. నయనతార పేమెంట్ క్లియర్ చేస్తేనే ఆమె షూటింగు పూర్తి చేస్తుందని, పారితోషికం భారీగా తీసుకుందని ఇన్నాళ్లూ వచ్చిన వార్తలకు ఆయన మాటలతో ఫుల్ స్టాప్ పెట్టారు.
Next Story