Mon Dec 23 2024 08:33:23 GMT+0000 (Coordinated Universal Time)
సీఎం సీటు చుట్టూ జరిగే కథ.. గాడ్ ఫాదర్ ట్రైలర్ అదిరిపోయిందిగా !
ట్రైలర్ లో అక్కడక్కడా చిరంజీవి చెప్పిన డైలాగ్ లు పేలాయి. నేను రాజకీయాలకు దూరంగా ఉండొచ్చు కానీ..
మలయాళ సినిమా లూసిఫర్ కు తెలుగు రీమేక్ గా మోహన్ రాజా దర్శకత్వంలో.. మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమా గాడ్ ఫాదర్. ఈ సినిమాను సూపర్ గుడ్ ఫిలింస్, కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన థార్ మార్ , నజభజజజర పాటలు సూపర్ హిట్ అయ్యాయి. తాజాగా గాడ్ ఫాదర్ ట్రైలర్ రిలీజ్ అయింది. అనంతపురం లో జరుగుతోన్న సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సూపర్ గుడ్ ఫిలింస్ అధినేతలు ట్రైలర్ ను లాంచ్ చేశారు. ట్రైలర్ చూస్తుంటే ఇది ఒక సీఎం సీటు చుట్టూ జరిగే కథలా కనిపిస్తోంది. ఈ ట్రైలర్ లో చిరంజీవి బ్రహ్మ క్యారెక్టర్ లో కనిపించారు.
ట్రైలర్ లో అక్కడక్కడా చిరంజీవి చెప్పిన డైలాగ్ లు పేలాయి. నేను రాజకీయాలకు దూరంగా ఉండొచ్చు కానీ.. రాజకీయం నానుంచి దూరంగా లేదు అన్న ఆడియో డైలాగ్ ఇంతకుముందే వచ్చింది. తాజాగా వచ్చిన ట్రైలర్ తో అది సినిమాలో డైలాగ్ అని తేలిపోయింది. ట్రైలర్ లో సీఎం సీటు కోసం సత్యదేవ్, నయనతార పోటీపడుతున్నట్లు కనిపిస్తారు. వారిద్దరే చిరంజీవికి వ్యతిరేకంగా ఉంటారని తెలుస్తోంది. ఇక ట్రైలర్ ఆఖర్లో బ్రహ్మకు సపోర్ట్ గా సల్మాన్ ఖాన్ రావడం చూపిస్తారు. సినిమాలో ఫైట్స్ ఏ స్థాయిలో ఉంటాయో ట్రైలర్ చూస్తేనే తెలుస్తోంది. ఇంకెందుకు ఆలస్యం.. గాడ్ ఫాదర్ ట్రైలర్ పై మీరూ ఓ లుక్కేయండి.
Next Story