Mon Dec 23 2024 08:50:59 GMT+0000 (Coordinated Universal Time)
గ్రాండ్ గా గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఆ ఇద్దరూ ఏం మాట్లాడనున్నారు
ఈ ఈవెంట్ కోసం మెగా ఫ్యాన్స్, ప్రేక్షకులు భారీ ఎత్తున అనంతపురం చేరుకుంటున్నారు. కాగా.. ఈ ఈవెంట్ కి
మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన లూసిఫర్ కు.. తెలుగు రీమేక్ గా రూపొందించిన చిత్రం గాడ్ ఫాదర్. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి మెయిన్ లీడ్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నేడు అనంతపురంలోని కమల్ నగర్ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్స్ లో గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా ప్రారంభమైంది.
ఈ ఈవెంట్ కోసం మెగా ఫ్యాన్స్, ప్రేక్షకులు భారీ ఎత్తున అనంతపురం చేరుకుంటున్నారు. కాగా.. ఈ ఈవెంట్ కి వచ్చే గెస్టుల సంగతి అటుంచితే.. చిరంజీవి, నిర్మాత ఎన్వీ ప్రసాద్ ఏం మాట్లాడుతారా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. ప్రీ-రిలీజ్ ఈవెంట్ రోజున గాడ్‌ఫాదర్ సినిమాకు సంబంధించి చాలా విషయాలను మాట్లాడతానని పలుమార్లు చెప్పడంతో ఆసక్తి నెలకొంది. నయనతార, సత్యదేవ్, సల్మాన్ ఖాన్, పూరీ జగన్నాధ్ ముఖ్యపాత్రల్లో నటించిన ఈ సినిమాకు తమన్ సంగీతం అందించాడు.
Next Story