Mon Dec 23 2024 03:47:37 GMT+0000 (Coordinated Universal Time)
గాడ్ ఫాదర్ టైటిల్ సాంగ్.. సోషల్ మీడియాలో సందడి
'తార్ మార్ తక్కర్ మార్', 'నజభజ జజర' పాటలు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు టైటిల్ సాంగ్
మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా మరో రెండ్రోజుల్లో థియేటర్లలో విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్ర బృందం ప్రమోషన్లను వేగవంతం చేసింది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, ట్రైలర్ సినిమాపై హైప్స్ పెంచేశాయి. ఇటీవలే సినిమా ప్రీ రిలీజ్ వేడుకను అనంతపురంలో నిర్వహించగా.. వేదికపై చిరంజీవి చెప్పిన డైలాగులకు, స్పీచ్ కి అభిమానులు ఫిదా అయ్యారు. తాజాగా గాడ్ ఫాదర్ నుంచి టైటిల్ సాంగ్ విడుదల చేశారు.
ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాయగా.. తమన్ బాణీలు అందించారు. 'తార్ మార్ తక్కర్ మార్', 'నజభజ జజర' పాటలు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు టైటిల్ సాంగ్ కూడా రావడంతో సోషల్ మీడియాలో మెగా అభిమానులు సందడి చేస్తున్నారు. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది. సినిమాలో సల్మాన్ ఖాన్ కీలకపాత్రలో నటించడంతో ఉత్తరాదిలోనూ సినిమాపై అంచనాలున్నాయి. సత్యదేవ్ ప్రతినాయక పాత్ర పోషించగా, నయనతార కీలక పాత్రలో కనిపించనుంది. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్లపై రామ్ చరణ్, ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
Next Story