Mon Dec 23 2024 12:09:31 GMT+0000 (Coordinated Universal Time)
గుడ్ సఖి ట్రైలర్.. పక్కా పల్లెటూరి యాస, భాషలో కీర్తి సురేష్
నగేశ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కీర్తి సురేష్ గ్రామీణ ప్రాంతానికి చెందిన గిరిజన యువతిగా కనిపించనుంది. ఊరి జనాల
కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో, జగపతి బాబు, ఆది పినిశెట్టి కీలక పాత్రల్లో రూపొందిన సినిమా గుడ్ లక్ సఖి. సుధీర్ చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమా గతేడాదే విడుదల కావాల్సింది. కానీ.. కోవిడ్ కారణంగా విడుదల వాయిదా పడింది. జనవరి 28వ తేదీన గుడ్ లక్ సఖి.. తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు థియేటర్లలో విడుదల కానుంది.
నగేశ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కీర్తి సురేష్ గ్రామీణ ప్రాంతానికి చెందిన గిరిజన యువతిగా కనిపించనుంది. ఊరి జనాలకు ఆమె ఎదురొస్తే మంచిది కాదన్న నమ్మకం. ఆ తర్వాత ఆమె రైఫిల్ షూటర్ గా ఎలా ఎదిగింది. బ్యాడ్ లక్ సఖి.. గుడ్ లక్ సఖి గా నిరూపించుకుందా ? అనేదే కథ. ఈ సినిమాలో కీర్తి సురేష్ కు జోడీగా ఆదిపినిశెట్టి నటించగా.. ఆమెకు కోచ్ గా జగపతిబాబు కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల కాగా.. పక్కా పల్లెటూరి గెటప్, యాస, నడకలో కీర్తి ఒదిగిపోయింది. మరి ఈ సినిమా హిట్ కొడుతుందా ? లేక పెంగ్విన్, మిస్ ఇండియా లాగే డిజాస్టర్ లిస్ట్ లోకి చేరుతుందా తెలియాలంటే జనవరి 28 వరకూ ఆగాల్సిందే.
News Summary - Good Luck Sakhi Trailer.. movie releasing on january 28th
Next Story