Mon Dec 23 2024 16:12:11 GMT+0000 (Coordinated Universal Time)
సర్కారు వారి పాట నుంచి మరో అప్డేట్
మహేష్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. సర్కార్ వారి పాట సినిమాలో మరోపాటను యాడ్ చేసినట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
మహేష్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. సర్కార్ వారి పాట సినిమాలో మరోపాటను యాడ్ చేసినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. "మురారి వా" అంటూ సాగే పాటను సినిమాలో యాడ్ చేసినట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ పాటతో మరోసారి కలెక్షన్లు పెరుగుతాయని, ఫ్యాన్స్ చూసేందుకు థియేటర్లకు తరలి వస్తారని చిత్ర యూనిట్ అభిప్రాయపడుతుంది.
రూ.200 కోట్లకు....
సూపర్ స్టార్ మహేష్ బాబు, పరశురాం కాంబినేషన్ లో వచ్చిన సర్కార్ వారి పాట హిట్ టాక్ తెచ్చుకుంది. థియేటర్లలో కలెక్షన్ల వర్షాన్ని కురిపిస్తుంది. ఇప్పటికే సర్కార్ వారి పాట రూ.200 కోట్లకు పైగానే కలెక్షన్లు రాబట్టిందని చిత్రయూనిట్ తెలిపింది. కొత్త పాటను యాడ్ చేయడంతో కలెక్షన్లు మరింతగా పెరుగుతాయని భావిస్తుంది.
Next Story