Mon Dec 23 2024 15:21:43 GMT+0000 (Coordinated Universal Time)
Gopichand : శ్రీకాంత్ మేనకోడలితో గోపీచంద్ పెళ్లిని.. ఆ నటుడే సెట్ చేశారట..
గోపీచంద్, సీనియర్ హీరో మేనకోడలిని పెళ్లి చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే వీరి పెళ్లి ఎలా సెట్ అయ్యింది..?
Gopichand : టాలీవుడ్ మాస్ హీరో గోపీచంద్.. సీనియర్ హీరో శ్రీకాంత్ అక్క కూతురు 'రేష్మ'ని పెళ్లి చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే వీరి పెళ్లి ఎలా సెట్ అయ్యింది..? అసలు గోపీచంద్‌కి రేష్మకి ఎలా పరిచయం అయ్యింది..? వీరి పెళ్లిని దగ్గరుండి జరిపించిన ఆ సీనియర్ నటుడు ఎవరు..? ఇలాంటి విషయాలు అన్నిటిని గోపీచంద్ రీసెంట్ గా 'అలీతో సరదాగా' షోలో తెలియజేసారు. గోపీచంద్ నటించిన 'భీమా' ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగానే గోపీచంద్.. అలీతో సరదాగా షోకి గెస్ట్ గా వచ్చారు. ఇక ఈ షోలో అలీ రేష్మతో పెళ్లి ఎలా సెట్ అయ్యిందని ప్రశ్నించగా, గోపిచంద్ బదులిస్తూ.. "ఒకసారి రేష్మకి సంబంధించిన ఓ ఫోటోని చూశాను, బాగా నచ్చింది. ఆ తరువాత ఆమె హీరో శ్రీకాంత్ గారి మేనకోడలు అని తెలిసింది. ఆయనతో నాకు అప్పటికే మంచి పరిచయం ఉంది. కానీ ఈ పెళ్లి విషయాన్ని నేనే ఆయనతో డైరెక్ట్ గా మాట్లాడలేనుగా. అందుకే చలపతి రావు అంకుల్ కి విషయం చెప్పాను. దీంతో ఆయనే వెళ్లి శ్రీకాంత్ గారితో మాట్లాడి పెళ్లి సెట్ చేసి, దగ్గరుండి పెళ్లి చేశారు" అని చెప్పుకొచ్చారు.
వీరి వివాహం 2013లో గ్రాండ్ గా జరిగింది. సినీ ప్రముఖులతో పాటు రాజకీయనాయకులు కూడా హాజరయ్యారు. ప్రస్తుతం గోపిచంద్, రేష్మకి ఇద్దరు కొడుకులు ఉన్నారు. కాగా ఇదే షోలో గోపీచంద్, రేష్మ తనకి ఇచ్చిన మొదటి గిఫ్ట్ గురించి కూడా తెలియజేసారు. రేష్మ ఓ టీ షర్ట్ అండ్ గ్రీటింగ్ కార్డుని గోపీచంద్ కి మొదటిసారి గిఫ్ట్ గా ఇచ్చారట.
Next Story