Mon Dec 23 2024 06:00:29 GMT+0000 (Coordinated Universal Time)
ఎన్నో వాయిదాలు.. రిలీజ్ కష్టమవ్వడంతో డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారట
గత సంవత్సరం డిసెంబర్లో, తన పెళ్లికి ముందు విక్కీ కౌశల్ తన కొత్త చిత్రం
విక్కీ కౌశల్, భూమి పెడ్నేకర్, కియారా అద్వానీ నటించిన 'గోవింద నామ్ మేరా' సినిమా ఈ సంవత్సరం బాలీవుడ్ అభిమానులు ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటి. విక్కీ కౌశల్ అభిమానులు.. భూత్ పార్ట్ వన్: ది హాంటెడ్ షిప్ తర్వాత విక్కీ తర్వాతి సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. 'గోవింద నామ్ మేరా' కూడా థియేటర్ లో విడుదలవ్వదని తెలియడంతో విక్కీ అభిమానులు హర్ట్ అవుతున్నారు. శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహించిన గోవింద నామ్ మేరా డైరెక్ట్ గా OTT లో విడుదల కాబోతోంది.
బాలీవుడ్ లైఫ్ రిపోర్ట్ ప్రకారం, నిర్మాత కరణ్ జోహార్ ఈ చిత్రాన్ని ఎక్కువ కాలం థియేటర్ రిలీజ్ కోసం ఎదురు చూస్తూ ఉండడానికి ఆసక్తి చూపడం లేదు. ఈ చిత్రం జూన్లో విడుదల కావాల్సి ఉండగా.. ఇప్పటి వరకూ దీనిపై అధికారికంగా ఎలాంటి అప్డేట్ లేదు. ఈ సినిమా టీజర్ కూడా రాలేదు. శశాంక్ ఖైతన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్పై కరణ్ జోహర్ నిర్మించాడు. ఈ చిత్రం ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఈ క్రమంలో మేకర్స్ ఈ మూవీని నేరుగా ఓటీటీలోనే విడుదల చేయాలని ఆలోచిస్తున్నారట. ఎందుకంటే ఈ ఏడాది మొత్తం బాలీవుడ్ క్యాలెండర్ పెద్ద పెద్ద సినిమాల రిలీజ్ డేట్లతో నిండి ఉంది. ఈ క్రమంలో గోవిందా నామ్ మేరా సినిమాను విడుదల చేయడం కరెక్టు కాదని భావించి కరణ్ జోహార్ ఓటీటీ వైపు మొగ్గు చూపుతున్నాడని తెలుస్తోంది. కరణ్ జోహార్ థియేట్రికల్ విండో కోసం మిగిలిన సినిమాలతో విడుదల చేయకూడదని భావిస్తుండడంతో.. OTT విడుదలను ఎంచుకోవచ్చని భావిస్తున్నారు.
గత సంవత్సరం డిసెంబర్లో, తన పెళ్లికి ముందు విక్కీ కౌశల్ తన కొత్త చిత్రం 'గోవింద నామ్ మేరా' టైటిల్ను ప్రకటించాడు. ఇందులో కియారా అద్వానీ, భూమి పెడ్నేకర్ కూడా నటించారు. ఈ చిత్రానికి శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహించారు. వయాకామ్ 18 స్టూడియోస్ సహకారంతో కరణ్ జోహార్, అపూర్వ మెహతా, శశాంక్ ఖైతాన్ నిర్మించారు. ఈ చిత్రం జూన్ 10, 2022న థియేటర్ రిలీజ్ అవ్వనుందని తెలిపారు. కానీ ఇప్పటి వరకూ ఎలాంటి చప్పుడు లేదు.
News Summary - Govinda Naam Mera Vicky Kaushal, Kiara Advani, Bhumi Pednekar starrer to skip theatrical release
Next Story