గూఢచారి ప్రమోషన్స్ కోసం అంత బడ్జెట్టా..?
రేవు శుక్రవారం బాక్సాఫీసు బరిలో మూడు సినిమాలు ఉన్నాయి. అందులో సుశాంత్ - రాహుల్ రవీంద్రన్ సినిమా చి. ల.సౌ ప్రమోషన్స్ లో దూసుకుపోతుంది. అక్కినేని ఫ్యామిలీ ఈ సినిమాని బాగా ప్రమోట్ చేస్తోంది. ఇక క్యుటేస్ట్ జంట నాగ చైతన్య - సమంతలు ఈ సినిమా విడుదలను తమ భుజాలపై మోస్తున్నారు. అయితే ఈ శుక్రవారం మరో రెండు సినిమాలు కూడా దిగబోతున్నాయి. అందులో క్షణం సినిమకి కథ అందించడమే కాక.. ఆ సినిమా లోకీ రోల్ పోషించిన అడవి శేష్ హీరోగా వస్తున్న గూఢచారి సినిమా. మీడియం బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటి వరకు ప్రమోషన్స్ లో కాస్త వీక్ గానే కనిపిస్తుంది.
సినిమాపై నమ్మకంతో నిర్మాతలు
అయితే ఈ రెండు రోజుల్లోనే గూఢచారి ప్రమోషన్స్ ని పీక్స్ లోకి తీసుకెళ్లడానికి.. అలాగే సినిమా విడుదలై పాజిటివ్ టాక్ వస్తే మరింత ప్రమోషన్స్ చెయ్యాలని గూఢచారి టీమ్ డిసైడ్ అయ్యిందట. అందులో భాగంగానే గూఢచారి ప్రమోషన్స్ కోసం దాదాపుగా మూడు కోట్ల బడ్జెట్ ని నిర్మాతలు కేటాయించినట్లుగా ఒక వార్త ఫిలిం సర్కిల్స్ లో హల్చల్ చేస్తుంది. మరి అభిషేక్ పిక్చర్స్ నిర్మాతలకు గూఢచారి సినిమాపై ఉన్న నమ్మకమే ఈ సినిమాకి ఈమేర ప్రమోషన్స్ కోసం మూడు కోట్లు పెట్టిస్తుందనే టాక్ వినబడుతుంది. మరి సినిమా బడ్జెట్ విషయంలో ఎక్కడా వెనకడుగు వెయ్యని అభిషేక్ పిక్చర్స్ వారు ఇప్పుడు ప్రమోషన్స్ విషయంలోనూ జోరు చూపిస్తారంట.
విశ్వాసమా..? అతివిశ్వాసమా..?
ఇక గూఢచారి సినిమా పబ్లిసిటీని కానీవినీ ఎరుగని రీతిలో చేపట్టి సినిమా మీద ప్రేక్షకులకు ఎక్కడ లేని ఆసక్తిని క్రియేట్ చెయ్యాలని మేకర్స్ ప్లాన్ గా చెబుతున్నారు. మరి ఇప్పటికే ట్రైలర్స్, పోస్టర్స్ లో గూఢచారి లిప్ లక్స్ బాగా ఫెమస్ అయ్యాయి. మరి ఆ కిస్ సీన్స్ ఉన్నప్పటికీ గూఢచారి సినిమాకి సెన్సార్ నుండి ఎటువంటి సమస్యలు ఎదురు కాలేదు. అంటే పోస్టర్స్ లో ఉన్నట్లుగా సినిమలో ఆ కిస్సింగ్ సీన్స్ ఉంటాయో లేదో అనే అనుమానం ఇప్పుడు ఉంది. ఏది ఏమైనా సినిమా మీద అభిషేక్ పిక్చర్స్ వారికీ కాన్ఫిడెన్సా లేక ఓవర్ కాన్ఫిడెన్సా అనేది మాత్రం సినిమా విడుదలయ్యేవరకు చెప్పడం కష్టమే.