వైల్డ్ కార్డులే కాదు… గెస్ట్ లు కూడా…?
బిగ్ బాస్ అన్నాక వైల్డ్ కార్డులు సహజం. కాకపోతే సీజన్ 4 కి మాత్రం మొదటి మూడు వరాలే ముగ్గురు వైల్డ్ కార్డులు ఎంట్రీ ఇచ్చి షాకిచ్చారు. [more]
బిగ్ బాస్ అన్నాక వైల్డ్ కార్డులు సహజం. కాకపోతే సీజన్ 4 కి మాత్రం మొదటి మూడు వరాలే ముగ్గురు వైల్డ్ కార్డులు ఎంట్రీ ఇచ్చి షాకిచ్చారు. [more]
బిగ్ బాస్ అన్నాక వైల్డ్ కార్డులు సహజం. కాకపోతే సీజన్ 4 కి మాత్రం మొదటి మూడు వరాలే ముగ్గురు వైల్డ్ కార్డులు ఎంట్రీ ఇచ్చి షాకిచ్చారు. గత సీజన్స్ లో అయితే షో మొదలైన 15 రోజులకే, నెల రోజులకి వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ బిగ్ బాస్ లోకి ఉండేది. కానీ సీజన్ 4 లో మాత్రం మూడు వారాలకే పొలోమంటూ మూడు వైల్డ్ కార్డులు ఎంట్రీ ఇచ్చేసారు. అయితే అందులో కుమార్ సాయి అంతగా ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నాడు. ఇక జబర్దస్త్ అవినాష్ మాత్రం వైల్డ్ కార్డు ఎంట్రీ తో బుల్లితెర ప్రేక్షకులని ఫుల్ గా శాటిస్ఫాయ్ చేస్తున్నాడు. ఇక మూడో వైల్డ్ కార్డు.. స్వాతి దీక్షిత్.. మంచి స్ట్రాటజీ తో బరిలోకి దిగినట్లుగా కంటెస్టెంట్ లాస్య ఆరోపణ. ఇక స్వాతి దీక్షిత్ హాట్ హాట్ గా మాత్రం అదరగొట్టేస్తుంది.
ఇక వైల్డ్ కార్డులు ఓకె.. ఇప్పుడు గెస్ట్ ల విషయంలో బిగ్ బాస్ సీజన్ 4 లో సస్పెన్స్ స్టార్ట్ అయ్యింది. గతం సీజన్స్ లో తమ సినిమాల ప్రమోషన్స్ కోసం హీరో హెఓరోయిన్స్ చాలామంది బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టి బుల్లితెర ద్వారా సినిమాలను ప్రమోట్ చేసుకునేవారు. పెద్ద స్టార్స్ కూడా తమ సినిమాల ప్రమోషన్స్ కొరకు బిగ్ బాస్ స్టేజ్ ఎక్కారు. అయితే ఇప్పుడు థియేటర్స్ మూతబడినా.. కొన్ని సినిమాలు ఓటిటి ద్వారా ప్రేక్షకుల వద్దకు వచ్చేస్తున్నాయి. అందులో అనుష్క నిశ్శబ్దం, రాజ్ తరుణ్ ఒరేజ్ బుజ్జిగాలు అక్టోబర్ 2 న ఓటిటి ద్వారా విడుదలకాబోతున్నాయి. సోషల్ మీడియాలో ఆ సినిమాల ప్రమోషన్స్ కూడా జరుగుతున్నాయి. కోవిడ్ నిబంధనలతో ప్రెస్ మీట్స్, ఆడియో, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ని ఆపేసారు. కానీ సోలో గా సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నారు. మరి ఇలాంటి కరోనా టైం లో అనుష్క బ్యాచ్, రాజ్ తరుణ్ వాళ్ళు బిగ్ బాస్ లోకి అడుగుపెట్టి సినిమాలను ప్రమోట్ చేసుకుంటారా? లేదంటే కరోనా కారణంగా బిగ్ బాస్ యాజమాన్యం గెస్ట్ లకు నో ఎంట్రీ బోర్డు పెట్టిందా అనేది తెలియాల్సి ఉంది.
- Tags
- big boss 4