Mon Dec 23 2024 03:54:47 GMT+0000 (Coordinated Universal Time)
దసరాకి ముందే అన్‌స్టాపబుల్-3.. ఫస్ట్ ఎపిసోడ్ గెస్ట్ ఎవరంటే..?
బాలయ్య అన్‌స్టాపబుల్ సీజన్ 3 స్టార్ట్ కానుంది. ఇక ఈసారి ఫస్ట్ ఎపిసోడ్ గెస్ట్‌గా..
బాలకృష్ణ ఈసారి దసరాకి డబుల్ ట్రీట్ ఇవ్వబోతున్నాడు. 'భగవంత్ కేసరి' సినిమాతో బిగ్ స్క్రీన్ పై సందడి చేయడానికి అక్టోబర్ 19న వస్తున్న బాలకృష్ణ.. అంతకుముందే పండుగా వారంలో అన్‌స్టాపబుల్ సీజన్ 3 తో బుల్లితెర పై సందడి చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే రెండు సీజన్లు ఆడియన్స్ ముందుకు రాగా.. రెండు విశేషమైన ప్రేక్షాధారణ సంపాదించుకున్నాయి. దీంతో మూడో సీజన్ కోసం ఆడియన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
మొదటి సీజన్ మోహన్ బాబుతో మొదలుపెట్టి మహేష్ బాబుతో గ్రాండ్ గా ముగించారు. ఇక సెకండ్ సీజన్ ని చంద్రబాబు నాయుడుతో స్టార్ట్ చేసి ప్రభాస్, పవన్ కళ్యాణ్ తో నెవెర్ బిఫోర్ ఎండింగ్ వేశారు. దీంతో సీజన్ 3 పై ఓ రేంజ్ అంచనాలు నెలకొన్నాయి. కాగా ప్రేక్షకులంతా బాలయ్య, చిరు కలయిక కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సీజన్ ని చిరంజీవి ఎపిసోడ్ తోనే మొదలు అయ్యే ఛాన్స్ కూడా ఉందని వార్తలు వినిపించాయి.
తాజాగా ఆహా టీం ఈ సీజన్ 3 అప్డేట్ ని అనౌన్స్ చేసింది. 'ఈసారి సప్పుడు జర గట్టిగా ఉంటది' అంటూ చెబుతూ.. మొదటి ఎపిసోడ్ గెస్ట్‌లు ఎవరు అన్నది కూడా తెలియజేసేశారు. 'భగవంత్ కేసరి' మూవీ టీమ్.. సీజన్ 3 ఫస్ట్ ఎపిసోడ్ లో అతిథులుగా వచ్చి సందడి చేయబోతున్నట్లు వెల్లడించారు. చిరంజీవి లాంటి స్టార్ తో గ్రాండ్ గా లాంచ్ అవుతుంది అనుకున్న ప్రేక్షకులకు ఇది కొంచెం నిరాశ కలిగిస్తుంది.
కాగా ఈ సీజన్ లో రామ్ చరణ్, తెలంగాణ మంత్రి కేటీఆర్ గెస్ట్లుగా వచ్చే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది. ఇక ప్రస్తుతం ఏపీ, తెలంగాణలో ఎలక్షన్ ఫివర్ మొదలైంది. దీంతో షో నిర్వాహకులు ఈ సీజన్ లో పొలిటికల్ లీడర్స్ ని తీసుకు వచ్చే ఛాన్స్ కూడా ఉంటుందని నెటిజెన్స్ అంచనాలు వేస్తున్నారు. మరి ఆహా టీం ఈ సీజన్ ని ఏ రేంజ్ లో ప్లాన్ చేశారో చూడాలి.
Next Story