Mon Dec 23 2024 09:46:35 GMT+0000 (Coordinated Universal Time)
Trivikram : త్రివిక్రమ్ నా ప్రేమని అంగీకరించారు.. టాలీవుడ్ నటి..
ఓ టాలీవుడ్ నటి త్రివిక్రమ్ కి ప్రపోజ్ చేశారట. త్రివిక్రమ్ కూడా దానిని అంగీకరించారట. ఈ విషయాన్ని ఆమె తెలియజేశారు.
Trivikram : మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కి టాలీవుడ్ లో హీరోలతో సమానంగా ఫేమ్ ఉంది. ఆయన సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే.. హీరో ఎవరు అన్న విషయం పెద్దగా అవసరం లేదు. ఆయన సినిమాల్లో ఆయన రాసిన కథ, మాటలే హీరోలు. అందుకే ఆయనకి హీరోతో సమానంగా క్రేజ్ ఉంటుంది. ఇక ఆయన వీరాభిమాని అయిన ఓ టాలీవుడ్ నటి.. త్రివిక్రమ్ కి ప్రపోజ్ చేశారట. త్రివిక్రమ్ కూడా దానిని అంగీకరించారట. ఈ విషయాన్ని ఆమె తెలియజేశారు. ఇంతకీ ఆ యాక్ట్రెస్ ఎవరు..?
టాలీవుడ్ లో బుల్లితెర పై యాంకర్ గా కనిపిస్తూ, వెండితెర పై పలు సినిమాల్లో ముఖ్య పాత్రలు చేస్తూ వస్తున్న నటి 'భానుశ్రీ'. ఈ భామకి త్రివిక్రమ్ అంటే పిచ్చి ప్రేమ అంటా. ఆయనని ఒక్కసారైనా కలవాలని ఎన్నోసార్లు అనుకున్నారట. ఇటీవల అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ ఒక యాడ్ షూట్ చేశారు. ఆ యాడ్ లో భానుశ్రీకి అవకాశం ఇచ్చారు. భానుశ్రీ ఆ యాడ్ ని కేవలం త్రివిక్రమ్ కోసం ఓకే చేశారట.
యాడ్ షూటింగ్ సమయంలో త్రివిక్రమ్ కి భానుశ్రీ.. 'ఐ లవ్యు' అంటూ ప్రపోజ్ చేశారట. దానికి ఆయన కూడా 'ఐ లవ్యు టు' అని బదులిచ్చారట. ఆ తరువాత ఆయనతో ఒక ఫోటో కూడా దిగారు. ఆ ఫోటో గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించగా.. భానుశ్రీ ఈ లవర్ స్టోరీ చెప్పుకొచ్చారు. అలాగే తాను రాజమౌళి వంటి పెద్ద దర్శకులతో కూడా పని చేసినట్లు, కానీ ఎవరితో ఫోటో దిగలేదు. కేవలం త్రివిక్రమ్ తోనే ఫోటో దిగాను అంటూ ఆయన పై తనకి కూడా ప్రేమని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
కాగా త్రివిక్రమ్ ప్రస్తుతం మహేష్ బాబుతో గుంటూరు కారం సినిమా తెరకెక్కిస్తున్నారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది.
Next Story