Mon Dec 23 2024 07:03:11 GMT+0000 (Coordinated Universal Time)
Kurchi Tata : కుర్చీ తాత పై పోలీసులు కంప్లైంట్లు.. ఎందుకో తెలుసా..?
గుంటూరు కారం మూవీ సాంగ్ తో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయిన కుర్చీ తాతని అరెస్ట్ చేసిన పోలీసులు.
Kurchi Tata : హైదరాబాద్ నగరంలో ఒక పార్క్ దగ్గర నివసించే తాతని ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ చేయడం, ఆ ఇంటర్వ్యూలో ఆ తాత మాట్లాడిన 'కుర్చీ మడత పెట్టి' అనే డైలాగ్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవ్వడం, ఆ తరువాత దానిని మహేష్ బాబు వంటి సూపర్ స్టార్ తన సినిమా సాంగ్ లో ఉపయోగించడంతో.. కుర్చీ తాత రెండు తెలుగు రాష్ట్రాల్లో తెగ వైరల్ అయ్యిపోయాడు.
కుర్చీతాత అసలు పేరు ఏంటంటే.. షేక్ అహ్మద్ పాషా. తన కుర్చీ డైలాగ్ ని ఇటీవల గుంటూరు కారం సినిమా సాంగ్ లో ఉపయోగించుకున్నందుకు మ్యూజిక్ డైరెక్టర్ థమన్.. ఆ తాతకు ఆర్ధిక సహాయం చేశారు. ఇందుకు మధ్యలో వైజాగ్ సత్య అనే వ్యక్తి సహాయ పడ్డాడు. కుర్చీ తాతని థమన్ దగ్గరకి తీసుకువెళ్లి లక్ష రూపాయిలు ఆర్ధిక సాయం కలిగేలా చేశాడు. ఇక గుంటూరు కారంతో కుర్చీ తాత బాగా వైరల్ అవుతుండడంతో.. పలు యూట్యూబ్ చానెల్స్ తాతతో ఇంటర్వ్యూలు చేస్తూ వస్తున్నారు.
ఈక్రమంలోనే పలు ఇంటర్వ్యూలో కుర్చీ తాత.. తనకి సహాయపడిన వైజాగ్ సత్యనే వ్యక్తిగతంగా దూషిస్తూ కామెంట్స్ చేస్తున్న వచ్చారు. దీంతో వైజాగ్ సత్య, కుర్చీ తాతపై కంప్లైంట్ ఇచ్చారు. అలాగే స్వాతినాయుడు కూడా కుర్చీ తాత తనని తిడుతూ ఇంటర్వ్యూలు చేస్తున్నారని ఫిర్యాదు చేడడంతో.. కుర్చీ తాతని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే విచారణలో కుర్చీ తాత చెప్పిందేంటంటే.. కొంతమంది యూట్యూబర్స్ తనకి మందు పోయించి వాళ్లని తిట్టమని చెప్పడంతోనే అలా చేసినట్లు చెప్పుకొచ్చాడట.
Next Story