Mon Dec 23 2024 16:26:19 GMT+0000 (Coordinated Universal Time)
Mahesh Babu : మహేష్ బాబు 'జిమ్ ట్రైనర్' ఎవరో తెలుసా..?
మహేష్ తన జిమ్ ట్రైనర్ ని పరిచయం చేస్తూ ఒక క్యూట్ ఫోటో షేర్ చేశారు ప్రస్తుతం అది నెట్టింట వైరల్ గా మారింది.
Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబుకి వయసుతో పాటు అందం కూడా పెరుగుతూనే వెళ్తుంది. ఏజ్ పెరిగే కొద్దీ ఇంకా యంగ్ గా మారుతూ వస్తున్నారు. అయితే మహేష్ ఇలా హ్యాండ్సమ్ గా కనిపించడానికి చాలా కఠిన శిక్షణే ఉంది. జిమ్ లో కఠిన కసరత్తులు చేస్తూ బాడీ ఫిట్నెస్ మెయిన్టైన్ చేస్తూ డైట్ ఫాలో అవుతూ.. యంగ్ లుక్ లో దర్శనమిస్తున్నారు. కాగా జిమ్ లో వర్క్ అవుట్స్ చేసే ఫోటోలను, వీడియోలను మహేష్ బాబు తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంటారు.
తాజాగా మహేష్ తన జిమ్ ట్రైనర్ ని పరిచయం చేస్తూ ఒక క్యూట్ ఫోటో షేర్ చేశారు ప్రస్తుతం అది నెట్టింట వైరల్ గా మారింది. ఇంతకీ మహేష్ బాబుకి జిమ్ లో ట్రైనింగ్ ఇచ్చే ఆ ట్రైనర్ ఎవరంటే.. మహేష్ పెంపుడు కుక్క 'స్నూపీ'. మహేష్ బాబు ఒక పిక్ షేర్ చేస్తూ.. "మీ క్యూటెస్ట్ ట్రైనర్ మీకు శిక్షణ ఇస్తున్నప్పుడు రెస్ట్ అనేది ఉండదు" అంటూ రాసుకొచ్చారు. ఆ పిక్‌లో.. మహేష్ జిమ్ లో వర్క్ అవుట్స్ చేస్తుంటే స్నూపీ ఎదురుగా కూర్చొని మహేష్ ని గమనిస్తూ కనిపిస్తుంది.
కాగా మహేష్ ఇంటిలో గతంలో 'ఫ్లూటో' అనే కుక్క ఉండేది. అయితే అది అనారోగ్యంతో మరణించింది. దీంతో మహేష్ 'స్నూపీ'ని దత్తత తీసుకున్నారు.ఇక అప్పటి నుంచి స్నూపీతో ఉన్న ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ వస్తున్నారు. ఈ మధ్యన కూడా ఒక ఫోటో షేర్ చేశారు. ఆ పిక్ లో మహేష్ స్నూపీ ఎత్తుకొని కనిపిస్తున్నారు. ఉదయాన్ని స్నూపీని ముద్దాడుతూ మొదలుపెట్టడం కంటే మంచి మార్గం ఉండదు అంటూ మహేష్ రాసుకొచ్చారు.
ఇక మహేష్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం గుంటూరు కారం సినిమాలో నటిస్తున్నారు. త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. 2024 సంక్రాంతికి ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు మూవీ టీం కష్టపడుతుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఏఎన్నార్ వర్చువల్ స్టూడియోలో జరుగుతుంది.
Next Story