Mon Dec 23 2024 15:59:46 GMT+0000 (Coordinated Universal Time)
Mahesh Babu : ఇది గమనించారా.. ఆల్మోస్ట్ ఇంగ్లీష్ లెటర్స్ అన్ని వాడేసిన మహేష్..
ఇది గమనించారా.. మహేష్ బాబు ఆల్మోస్ట్ ఇంగ్లీష్ లెటర్స్ (A-Z) లో ఉన్న అన్ని అక్షరాలా పై ఒక యాడ్ చేసేశారు.
Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలతో కంటే కమర్షియల్ యాడ్స్ తోనే ఆడియన్స్ ని ఎక్కువగా పలకరిస్తారు. ఇండియన్ ఫిలిం స్టార్స్ ఏ హీరో కూడా చేయనన్ని యాడ్స్ మహేష్ చేసి ఉంటారు అనడంలో పెద్ద సందేహం పడనవసరం లేదనుకుంటా. అయితే ఈ యాడ్స్ నుంచి వచ్చే సంపాదనని కూడా మహేష్ మంచి పనులకే ఉపయోగిస్తుంటారు. మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా పిల్లల వైద్యానికి, పేద ప్రజల విద్యకు, మరికొన్ని సోషల్ కార్యక్రమాలకు ఉపయోగిస్తుంటారు.
కాగా మహేష్ బాబు చేసిన యాడ్స్ లో మీరు ఇది గమనించారు. ఇప్పటి వరకు మహేష్ బాబు చేసిన యాడ్స్ అని చూసుకుంటే.. ఆల్మోస్ట్ ఇంగ్లీష్ లెటర్స్ (A-Z) లో ఉన్న అన్ని అక్షరాలను మహేష్ ఉపయోగించేశారు. మీకు ఆర్డమయ్యేలా చెప్పాలంటే.. A ఫర్ అభి బస్సు, B ఫర్ బిగ్ సి, C ఫర్ క్లోజ్ అప్.. ఇలా ఆల్మోస్ట్ ఇంగ్లీష్ లెటర్స్ లో ఉన్న ప్రతి అక్షరం పై ఒక యాడ్ చేసేశారు. ఇక మహేష్ బాబు చేయకుండా వదిలేసిన అల్పాబెట్స్ అంటే.. K, Q, X, Z.
ఈ విషయాన్ని తెలియజేస్తూ కొంతమంది నేటినెట్స్ సోషల్ మీడియాలో పోస్టులు వేస్తున్నారు. ఇక ఇది తెలుసుకున్న ఆడియన్స్.. ఏంటి మహేష్ బాబు ఇన్ని యాడ్స్ లో నటించారా..? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరికొంత మంది ఆ మిగిలిన లెటర్స్ పై కూడా యాడ్స్ చేసేస్తే మహేష్ బాబు కొత్త రికార్డుని సృష్టించినట్లు అవుతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి మహేష్ చేసిన ఆ యాడ్స్ లిస్ట్ వైపు మీరుకూడా ఒక లుక్ వేసేయండి.
ప్రస్తుతం మహేష్ నటిస్తున్న గుంటూరు కారం విషయానికి వస్తే.. ప్రస్తుతం హీరోహీరోయిన్స్ పై ఒక మాస్ సాంగ్ ని చిత్రీకరిస్తునట్లు సమాచారం. ఇటీవల ఈ సినిమా నుంచి 'దమ్ మసాలా' అనే సాంగ్ ని రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ ని అందుకుంది. థమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ కి జోడిగా శ్రీలీల, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని సంక్రాంతికి రిలీజ్ చేయడానికి మేకర్స్ సిద్ధం చేస్తున్నారు.
Next Story