Mon Dec 23 2024 14:48:04 GMT+0000 (Coordinated Universal Time)
మా ఆవిడతో ఇలా రావడం మొదటిసారి.. మహేష్ కామెంట్స్ వైరల్..
మా ఆవిడతో ఇలా రావడం మొదటిసారి అంటూ మహేష్ బాబు చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
టాలీవుడ్ స్టార్ కపుల్ మహేష్ బాబు, నమ్రతా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 'వంశీ' సినిమాలో కలిసి పని చేసిన ఈ ఇద్దరు.. ప్రేమించుకొని 2005లో పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరికి గౌతమ్, సితార ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ నలుగురు టాలీవుడ్ లో స్టార్స్ అనే చెప్పాలి. మహేష్ సినిమాలతో దూసుకు పోతుంటే, నమ్రతా బిజినెస్‌లతో, సితార బ్రాండ్ అంబాసడర్‌గా, సేవ కార్యక్రమాలతో గౌతమ్.. ఇలా ఫ్యామిలీ మొత్తం స్టార్స్ గా కొనసాగుతున్నారు.
కాగా మహేష్, నమ్రతా కలిసి ‘గౌరీ సిగ్నేచర్స్’ అనే సంస్థకి బ్రాండ్ అంబాసడర్స్ గా సైన్ చేశారు. తాజాగా ఈ సంస్థకి సంబంధించిన కొత్త బ్రాంచ్ హైదరాబాద్ లో ఓపెనింగ్ జరుపుకుంది. ఇక ఈ కార్యక్రమానికి మహేష్, నమ్రతా కలిసి వచ్చి సందడి చేశారు. షాప్ ఓపెనింగ్ అనంతరం వీరిద్దరూ మీడియా ప్రతినిధులతో ఇంటరాక్ట్ అయ్యారు. ఈక్రమంలో మహేష్ మాట్లాడిన కొన్ని మాటలు నెట్టింట వైరల్ గా మారాయి.
మహేష్ బాబు మాట్లాడుతూ.. "మా ఆవిడతో కలిసి ఇలా ప్రెస్ మీట్ కి రావడం ఇదే మొదటిసారి అనుకుంటా. నిజంగా ఇది చాలా ఆనందంగా అనిపిస్తుంది" అంటూ చెప్పుకొచ్చాడు. ఇక నమ్రతాకి ఒక గిఫ్ట్ ఇవ్వాలంటే మీరు ఏం ఇస్తారు అని ప్రశ్నించగా, మహేష్ బదులిస్తూ.. "తను షాప్ మొత్తం కావాలంటుంది. అందుకే నేను తన కోసం షాపింగ్ ఏం చేయను. తనే నా కోసం షాపింగ్ చేస్తుంటుంది" అని చెప్పుకొచ్చాడు.
ఒక పక్క ఇందుకు సంబందించిన వీడియోలు వైరల్ అవుతుంటే, మరోపక్క ఒక మ్యాగజైన్ కోసం మహేష్ బాబు చేసిన స్టైలిష్ ఫోటోషూట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ ఫోటోషూట్ లో మహేష్ బాబు లుక్స్ చూసిన అభిమానులు.. వయసు పెరుగుతున్న కొద్ది మహేష్ కి అందం కూడా పెరుగుతూ పోతుంది అంటూ కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. ఆ ఫోటోషూట్ వైపు కూడా ఒక లుక్ వేసేయండి.
Next Story