Mon Dec 23 2024 06:35:04 GMT+0000 (Coordinated Universal Time)
Mahesh Babu : సంక్రాంతి రేసులో మహేష్ ఎన్నిసార్లు పోటీ చేసి గెలిచాడు..?
సంక్రాంతి బరిలో మహేష్ బాబు ఇప్పటికి ఆరు సార్లు పోటీ చేశారు. మరి ఆ చిత్రాలు ఏంటి..? వాటి ఫలితాలు ఏంటో ఓ లుక్ వేసేయండి..
Mahesh Babu : 'గుంటూరు కారం' సినిమాతో మహేష్ బాబు ఈ సంక్రాంతికి ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. అయితే మహేష్ కెరీర్ లో ఇప్పటివరకు ఎన్నిసార్లు సంక్రాంతి రేసులో పోటీ చేసి గెలిచారు..? సంక్రాంతి బరిలో మహేష్ బాబు ఇప్పటికి ఆరు సార్లు పోటీ చేశారు. మరి ఆ చిత్రాలు ఏంటి..? వాటి ఫలితాలు ఏంటో ఓ లుక్ వేసేయండి..
టక్కరి దొంగ..
మహేష్ బాబు కౌ బాయ్ పాత్రలో కనిపిస్తూ నటించిన ఈ చిత్రం 2002 సంక్రాంతి రేసులో పోటీ చేసింది. భారీ అంచనాలు మధ్య రిలీజైన ఈ చిత్రం ప్లాప్ గా నిలిచింది.
ఒక్కడు..
ఆ నెక్స్ట్ ఇయర్ 2003 సంక్రాంతికి 'ఒక్కడు' సినిమాతో వచ్చి బ్లాక్ బస్టర్ ని అందుకున్నారు. మహేష్ కెరీర్ ని ఓ మలుపు తిప్పిన సినిమాగా ఇది గుర్తుండిపోయింది. ఇక ఈ సినిమాతో మొదలయింది మహేష్ సంక్రాంతి హిట్స్ పరంపర.
బిజినెస్మెన్..
పోకిరి తరువాత మహేష్, పూరి కలయికలో వచ్చిన ఈ చిత్రం.. 2012 సంక్రాంతికి రిలీజ్ అయ్యింది. ఈ కాంబినేషన్ మరోసారి తమ పంచ్ డైలాగ్స్ తో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసి విజయం అందుకున్నారు.
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు..
ఆ నెక్స్ట్ ఇయర్ 2013లో వెంకటేష్ తో కలిసి 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'ని తీసుకొచ్చి సూపర్ హిట్టుని అందుకొని టాలీవుడ్ లో మల్టీస్టారర్ పద్ధతికి మళ్ళీ ఊపిరి పోశారు.
1 నేనొక్కడినే..
మహేష్ సంక్రాంతి హిట్స్ పరంపరకి ఒక చిన్న బ్రేక్ వేసిన సినిమా అంటే 1 నేనొక్కడినే. 2014 సంక్రాంతికి భారీ అంచనాలు మధ్య రిలీజైన ఈ చిత్రం ప్లాప్ గా నిలిచింది.
సరిలేరు నీకెవ్వరూ..
ఇక లాస్ట్ గా 2020 సంక్రాంతికి 'సరిలేరు నీకెవ్వరూ' చిత్రం వచ్చి సూపర్ హిట్ ని అందుకున్నారు.
ఈ సినిమాల ఫలితాలు చూస్తే.. సంక్రాంతి టైములో మహేష్ కి సక్సెస్ రేట్ ఎక్కువుగానే ఉంది. మరి గుంటూరు కారంతో హిట్ అందుకుంటారేమో చూడాలి.
Next Story