Sun Dec 22 2024 18:39:33 GMT+0000 (Coordinated Universal Time)
క్యాన్సర్ ను జయించిన టాలీవుడ్ నటి.. ఇక షూటింగ్స్ షురూ
గోపీచంద్ హీరోగా తెరకెక్కిన ‘పంతం’ సినిమా తరువాత ఈ భామ సినిమాలకు దూరమైంది. కొంతకాలంగా బ్రెస్ట్..
ప్రముఖ టాలీవుడ్ నటి హంసనందిని క్యాన్సర్ ను జయించింది. 2015లో వచ్చిన 'ఒక్కటవుదాం' సినిమాతో వెండితెరకు పరిచయమైన హంసనందిని.. ఆ తర్వాత దర్శకుడు వంశీ తెరకెక్కించిన 'అనుమానాస్పదం' చిత్రంతో ఇండస్ట్రీలో గుర్తింపు సంపాదించుకుంది. కానీ.. ప్రభాస్ నటించిన మిర్చి సినిమాలో.. 'మిర్చి మిర్చి' అంటూ చేసిన స్పెషల్ సాంగ్ తో పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత వరుస ఆఫర్లు వచ్చాయి.
ఇక అక్కడి నుంచి స్టార్ హీరోల సినిమాలో స్పెషల్ సాంగ్స్, ప్రత్యేక అతిథిగా ఎంట్రీ ఇస్తూ అలరించింది. గోపీచంద్ హీరోగా తెరకెక్కిన 'పంతం' సినిమా తరువాత ఈ భామ సినిమాలకు దూరమైంది. కొంతకాలంగా బ్రెస్ట్ క్యాన్సర్ తో బాధపడుతూ.. చికిత్స పొందుతోంది. గతేడాది డిసెంబర్ లో తనకు క్యాన్సర్ ఉందన్న విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన హంసకు.. నెటిజన్లు త్వరగా కోలుకుని తిరిగి ఇండస్ట్రీకి రావాలని ధైర్యం చెప్పారు.
సంవత్సరం పాటు కాన్సర్ తో పోరాడిన హంస నందిని.. ఎట్టకేలకు దానిని జయంచి మళ్ళీ షూటింగ్ లో పాల్గొంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సెట్ లోని విజువల్స్ వీడియో తీసి "నా కో స్టార్స్ ని, సినిమా ప్రపంచాని చాలా మిస్ అయ్యాను. మళ్ళీ ఇప్పుడు తిరిగి సినిమా సెట్ లోకి అడుగుపెట్టడం పునర్జనంలా ఉంది" అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది.
Next Story