Mon Dec 23 2024 09:06:00 GMT+0000 (Coordinated Universal Time)
నేడే హన్సిక వివాహం.. అతిథులెవరో తెలిస్తే.. ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు
తన ప్రియుడు సోహైల్ ను యాపిల్ బ్యూటీ హన్సిక వివాహం చేసుకోనుంది. జైపూర్ లోని ఓ రాజకోటలో వీరి వివాహం..
బాలనటిగా ఇండస్ట్రీలోకి వచ్చి.. అలరించి, దేశముదురు చిత్రంతో హీరోయిన్ గా తెరంగేట్రం చేసిన నటి హన్సిక.. నేడు తన ప్రియుడిని పెళ్లాడనుంది. తన ప్రియుడు సోహైల్ ను యాపిల్ బ్యూటీ హన్సిక వివాహం చేసుకోనుంది. జైపూర్ లోని ఓ రాజకోటలో వీరి వివాహం కుటుంబసభ్యులు, సన్నిహితుల మధ్య అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ వివాహ వేడుకకు హన్సిక ప్రత్యేకంగా కొందరు అతిథుల్ని ఆహ్వానించిందట. ఆ అతిథులు ఎవరో పెద్ద సెలబ్రిటీలే అనుకుంటే పొరపాటు. హన్సిక ప్రత్యేకంగా నిరుపేద చిన్నారులను తన వివాహానికి ఆహ్వానించడం విశేషం.
హన్సిక తరచూ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటుంది. పలు ఎన్జీవోలతో కలిసి నిరుపేద చిన్నారులకు సాయం చేస్తోంది. ఈ క్రమంలోనే తన వివాహానికి అలాంటి కొందరు చిన్నారులకు సైతం ఆహ్వానాలు పంపించి తన మంచి మనసు చాటుకుంది. పెళ్లికి తమని పిలిచిన హన్సికకు ధన్యవాదాలు చెబుతూ సదరు చిన్నారులు చేసిన ఓ వీడియో ప్రస్తుతం నెట్ లో వైరల్ గా మారింది. ఇక, వివాహ వేదిక పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న చిన్నారులకు హన్సిక ఈ రోజు భోజనాన్ని పంపించనుంది. నిన్న జరిగిన మెహందీ, సంగీత్ వేడుకల్లో నూతన వధూవరులు ఉత్సాహంగా పాల్గొని, ఆడిపాడారు.
Next Story