Mon Dec 23 2024 02:28:01 GMT+0000 (Coordinated Universal Time)
Tollywood : తెలుగులో మొత్తం 12 సూపర్ హీరో సినిమాలు రాబోతున్నాయి..
తెలుగులో మొత్తం 12 సూపర్ హీరో సినిమాలు రాబోతున్నాయి. అవి ఎలా ఉండబోతున్నాయి తెలుసా..?
Tollywood : టాలీవుడ్ మేకర్స్ నేటి ఆడియన్స్ ని ఆకట్టుకునేలా న్యూ ఏజ్ స్టోరీస్ తో సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈక్రమంలోనే సూపర్ హీరో మూవీస్ కూడా రాబోతున్నాయి. అది కూడా ఒకటి కాదు రెండు కాదు 12 సూపర్ హీరో సినిమాలు రాబోతున్నాయి. సాధారణంగా సూపర్ హీరో సినిమాలు అంటే.. హాలీవుడ్ చిత్రాలే గుర్తుకు వస్తాయి. ఐరన్ మెన్, స్పైడర్ మెన్, ఐరన్ మెన్ అంటూ ఫిక్షనల్ క్యారెక్టర్స్ తో పలు సూపర్ హిట్ సినిమాలను హాలీవుడ్ మేకర్స్ ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు.
అంతేకాదు గ్రీక్ దేవుడిగా చెప్పే ‘థోర్’ని కూడా సూపర్ హీరోగా ప్రపంచానికి పరిచయం చేశారు. మరి మన హిందూ ధర్మంలో కూడా ఎంతో మంది దేవుళ్ళు ఉన్నారు. వాళ్ళకి సూపర్ పవర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ సూపర్ పవర్స్ ని వరల్డ్ ఆడియన్స్ కి తెలియజేస్తూ.. మన దేవుళ్లను సూపర్ హీరోలుగా ప్రపంచానికి పరిచయం చేసే భాద్యత టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తీసుకున్నారు.
ప్రస్తుతం ఈ హీరో 'హనుమాన్' చిత్రంతో మన మొదటి సూపర్ హీరోని పరిచయం చేయబోతున్నారు. ఆ తరువాత దేవుళ్ళ రాజైన 'ఇంద్రుడి' పాత్ర స్ఫూర్తి పొంది 'అధీర' అనే సూపర్ హీరో ఫిలిం తెరకెక్కించబోతున్నారు. ఈ చిత్రాలతో ప్రశాంత్ వర్మ.. ఒక సూపర్ సినిమాటిక్ యూనివర్స్ ని క్రియేట్ చేస్తున్నారు. ప్రశాంత్ సినిమాటిక్ యూనివర్స్ లో మొత్తం 12 సూపర్ హీరోల సినిమాలు రాబోతున్నాయని ప్రశాంత్ తెలియజేసారు.
ఈ 12 సూపర్ హీరోలు మన హిందూ ధర్మంలోని దేవుళ్ళ పాత్రని స్ఫూర్తి పొందే ఆడియన్స్ ముందుకు రాబోతున్నాయి. మరి ఇన్నాళ్లు హాలీవుడ్ సూపర్ హీరోల చూసి ఎంజాయ్ చేసిన ఇండియన్ ఆడియన్స్.. ఇప్పుడు మన సూపర్ హీరోస్ ని ఎక్స్పిరెన్స్ చేయబోతున్నారు. కాగా హనుమాన్ మూవీ ఈ సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది.
Next Story