Sun Dec 22 2024 22:02:40 GMT+0000 (Coordinated Universal Time)
Teja Sajja : అప్పుడు మహేష్‌కి కొడుకుగా.. ఇప్పుడు పోటీగా..
మహేష్ బాబుకి అప్పుడు కొడుకుగా నటించిన తేజ సజ్జ.. ఇప్పుడు సంక్రాంతికి 'హనుమాన్'తో గుంటూరు కారంకి పోటీగా వస్తున్నారు.
Teja Sajja : టాలీవుడ్ యువ హీరో తేజ సజ్జ సూపర్ హీరోగా నటిస్తున్న చిత్రం 'హనుమాన్'. ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ఆడియన్స్ ముందుకు రాబోతుంది. జనవరి 12న ఈ సినిమాని ఇండియాతో పాటు శ్రీలంక, జపాన్, చైనా, అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ, స్పెయిన్.. ఇలా అనేక దేశాల్లో మొత్తం 11 భాషల్లో విడుదల చేయబోతున్నారు. కాగా అదే రోజు తెలుగులో మహేష్ బాబు నటించిన గుంటూరు కారం కూడా రిలీజ్ కాబోతుంది.
త్రివిక్రమ్, మహేష్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ చిత్రం పై టాలీవుడ్ భారీ హైప్ నెలకుంది. మహేష్ బాబుని ఇప్పటివరకు చూడనంత మాస్ అవతారంతో ఈ మూవీలో కనిపించబోతున్నారట. ఈ మూవీ నుంచి రిలీజ్ చేస్తున్న మహేష్ మాస్ లుక్స్ కూడా ఓ రేంజ్ లో ఉండడంతో ఆడియన్స్ లో సినిమా భారీ క్రేజ్ ఏర్పడింది. ఇంతటి క్రేజ్ ఉన్న మూవీకి పోటీగా హనుమాన్ చిత్రం పోటీగా వస్తుంది.
అయితే ఇక్కడ విశేషం ఏంటంటే.. ఇప్పుడు మహేష్ కి పోటీగా వస్తున్న హనుమాన్ హీరో తేజ సజ్జ ఒకప్పుడు మహేష్ కి కొడుకుగా నటించారు. తేజ చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ స్టార్ట్ చేసిన విషయం అందరికి తెలిసిందే. ఈక్రమంలోనే 2000 సంవత్సరంలో మహేష్ హీరోగా నటించిన 'యువరాజు' మూవీలో కొడుకుగా తేజ సజ్జ నటించారు. అప్పుడు కొడుకుగా నటించిన తేజ.. ఇప్పుడు పోటీగా మహేష్ కి ఎదురు వస్తుండడంతో సోషల్ మీడియాలో ఈ విషయం వైరల్ గా మారింది.
మరి ఈ పోటీలో ఎవరు గెలుస్తారో చూడాలి. హనుమాన్ కథాంశం ఏంటంటే.. రామభక్తుడు హనుమంతుడి వల్ల హీరోకి పవర్స్ వచ్చి ఓ సూపర్ హీరోగా మారతాడు. ఆ తరువాత కథ ఏమైంది అనేది మూవీ. మహేష్ బాబు గుంటూరు కారం.. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్నట్లు తెలుస్తుంది.v
Next Story