Sun Dec 22 2024 21:05:51 GMT+0000 (Coordinated Universal Time)
HanuMan : హౌస్ఫులైన థియేటర్స్ లాకున్నారా.. హిందిలో ఆ రికార్డు బ్రేక్..
హైదరాబాద్ లో హనుమాన్ సినిమాకి హౌస్ఫులైన థియేటర్స్ లాకుంటున్నారట. మరో పక్క హిందీలో ఆ సినిమా రికార్డుని బ్రేక్ చేసేసింది.
HanuMan : టాలీవుడ్ చిన్న హీరో తేజ సజ్జ, చిన్న దర్శకుడు ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హీరో మూవీ 'హనుమాన్'. ఈ మూవీ రిలీజ్ అవ్వడానికి చాలా కష్టాలు పడింది. చిన్న సినిమా అని, సంక్రాంతి పండగ రేస్ నుంచి తప్పుకోవాలని మూవీ టీంకి బెదిరింపులు కూడా వెళ్లాయి. అయినాసరి చిత్ర యూనిట్ తమ సినిమాని రిలీజ్ చేయడానికి సిద్ధం చేసారు. దీంతో థియేటర్స్ ఇవ్వకుండా చేశారు. అయితే మూవీ టీం మాత్రం తమ కంటెంట్ పై నమ్మకం పెట్టుకొని రిలీజ్ చేశారు. కంటెంట్ ఉన్నోడికి ప్రేక్షకులే బ్రహ్మరథం పడతారు.
ఇంకేముంది సినిమాకి భారీ రెస్పాన్స్ వస్తుంది. పండుగ రేసులో హనుమాన్ మొదటి స్థానాన్ని దక్కించుకుంది. ఈ మూవీని చూసేందుకు అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో కొన్ని థియేటర్స్ హనుమాన్ ని తీసుకోని కొత్త షోలు ఏర్పాటు చేస్తున్నారు. ఆ షోలు కూడా కేవలం కొన్ని నిమిషాల్లోనే ఫుల్ అయ్యిపోతున్నాయి. ఈక్రమంలోనే హైదరాబాద్ ప్రసాద్ ఐమాక్స్ లో కూడా కొత్త షోలు ఏర్పాటు చేయగా హౌస్ ఫుల్ అయ్యిపోయాయి.
అయితే ఆ హౌస్ ఫుల్ షోలను క్యాన్సిల్ చేసి గుంటూరు కారం మూవీకి ఇచ్చారట. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది. ఇలా చేయడం పై ఆడియన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో హనుమాన్ పై పోజిటివిటీ, గుంటూరు కారం పై నెగటివిటీ మరింత పెరుగుతుంది. ఇది ఇలా ఉంటే, హనుమాన్ చిత్రం తక్కువ థియేటర్స్ తోనే కలెక్షన్స్ సునామీ సృష్టిస్తుంది.
మూడు రోజుల్లోనే ఈ చిత్రం 40 కోట్లకు పైగా కలెక్షన్స్ ని రాబట్టింది. ముఖ్యంగా నార్త్ లో ఈ చిత్రం రోజురోజుకి ప్రేక్షాధారణ పెంచుకుంటూ పోతుంది. తాజాగా ఈ చిత్రం బాలీవుడ్ లో 'కాంతార' లైఫ్ టైం కలెక్షన్స్ ని దాటేసినట్లు ప్రముఖ సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ తెలియజేసారు. ఈ చిత్రం బాలీవుడ్ లో మూడు రోజులకు గాను రూ.12.26 కోట్ల కలెక్షన్స్ రాబట్టినట్లు తెలియజేసారు.
Next Story