Sun Dec 22 2024 21:25:40 GMT+0000 (Coordinated Universal Time)
Mahesh Babu : 'గుంటూరు కారం'ని మించిపోయిన హనుమాన్.. ఏది చిన్న సినిమా..
హనుమాన్ సినిమా ఎవరు చూస్తారు అనుకున్నారు. కానీ ఇక్కడ లెక్క మారింది. 'గుంటూరు కారం'ని మించిపోయిన హనుమాన్..
Guntur Kaaram - Hanuman : ఈ సంక్రాంతికి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద సినిమాల జాతర ఓ రేంజ్ లో ఉండబోతుంది. మహేష్ బాబు 'గుంటూరు కారం', తేజ సజ్జ 'హనుమాన్', వెంకటేష్ 'సైంధవ్', నాగార్జున 'నా సామీ రంగ', రవితేజ 'ఈగల్' సినిమాలు పొంగల్ బరిలో పందానికి దిగుతున్నాయి. ఈ బరిలో నలుగురు సీనియర్ హీరోలు ఉంటే.. తేజ సజ్జ లాంటి ఒక్క యువ హీరో ఉన్నాడు. దీంతో చిన్న హీరో సినిమా 'హనుమాన్' ఎవరు చూస్తారు అని అనుకున్నారు.
కానీ ఇక్కడ లెక్క మారింది. సీనియర్ హీరోల సినిమాలను దాటి తేజ సినిమా ముందు వరసలోకి వచ్చింది. ఇంతకీ హనుమాన్ ఏ వరసలో ముందుకు వచ్చిందంటే.. బుక్ మై షోలో ఆడియన్స్ ఎక్కువ ఇంటరెస్ట్ చూపిస్తున్న మూవీగా హనుమాన్ ముందు వరుసలోకి వచ్చింది. చిన్న హీరో సినిమా, చిన్న పిల్లల కథ సినిమా ఎవరు చూస్తారని అందరూ కామెంట్స్ చేస్తున్నారు. కానీ ఈ చిత్రం చూడడానికి ప్రతిఒక్కరు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు.
బుక్ మై షోలో ఈ సినిమా రిలీజ్ కోసం ఇంటరెస్ట్ చూపిస్తున్న వారి సంఖ్య 180.2K ఉంటే.. గుంటూరు కారం 179.9K లైక్స్ తో తరువాత స్థానంలో ఉంది. ఇక మిగిలిన చిత్రాలు సైంధవ్, నా సామీ రంగ, ఈగల్ తరువాత స్థానాల్లో నిలిచాయి. ఇక ఇది చూసిన ఆడియన్స్.. ఇప్పుడు చెప్పండి ఏది చిన్న సినిమా అని ప్రశ్నిస్తున్నారు. హనుమాన్ రిలీజ్ కి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ దొరకడం లేదన్న వార్త మూవీ టీంని నిరాశపరుస్తున్నా.. ఆడియన్స్ ఆసక్తి విషయం చిత్ర యూనిట్ ఆనందపరుస్తుంది.
కాగా హనుమాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ ఆదివారం జనవరి 7న హైదరాబాద్ ఎన్ కన్వెన్షన్ హాల్లో జరగబోతుంది. ఈ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా రాబోతున్నారని సమాచారం. కాగా ఈ సినిమాలో చిరంజీవి ప్రెజెన్స్ కూడా ఉండబోతుందని తెలుస్తుంది. సినిమాలో గ్రాఫిక్స్ తో చూపించే హనుమంతుడి పాత్రని చిరంజీవి పోలికలతో డిజైన్ చేసినట్లు తెలుస్తుంది. ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ లో హనుమంతుడి కళ్ళు చిరంజీవి కళ్ళులా కనిపించాయి.
Next Story