హ్యాపీ వెడ్డింగ్ ఆడకపోయినా.. హ్యాపీగానే ఉన్నారు..!
గత శనివారం కుటుంబ కథా చిత్రం మెగా డాటర్ నిహారిక క్రేజ్ తో హ్యాపీ వెడ్డింగ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మెగా డాటర్ అన్నమాటే గాని నిహారికకి మాత్రం ఎలాంటి క్రేజ్ లేదని హ్యాపీ వెడ్డింగ్ సినిమా టాక్, కలెక్షన్స్ చూస్తుంటేనే అర్ధమవుతుంది. లోబడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా కుటుంబ కథా చిత్రమని చెప్పినప్పటికీ.. ఫ్యామిలీ ఆడియన్స్ ని ఏమాత్రం మెప్పించలేకపోయింది. నిహారిక నటన, సినిమాటోగ్రఫీ, కొన్ని డైలాగ్స్ తప్పించి ఈ సినిమాలో మరేమి ఆకట్టుకోలేకపోయాయి. అందులోనూ హీరో కూడా ఓ అన్నంత ఫేమ్ లేని హీరో కావడం మైనస్సే.
పెట్టిన డబ్బులు మాత్రం వచ్చేశాయా..?
ఇక కేవలం మూడు కోట్ల బడ్జెట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఈ వారంలో ఆ మూడు కోట్లను రికవరీ చేసే సత్తా అయితే ఉంది. ఎలాగూ హ్యాపీ వెడ్డింగ్ సినెమాతో పాటుగా విడుదలైన సాక్ష్యం సినిమాకు యావరేజ్ టాక్ రావడం హ్యాపీ వెడ్డింగ్ కి కొంతలో కొంత ఊరట. అయితే సినిమాపరంగా రెండున్నర కోట్లు బడ్జెట్ పెట్టిన నిర్మాతలు.. పబ్లిసిటీ కి మరో 50 లక్షలు ఖర్చు పెట్టారు. అంటే ఈ సినిమా మూడు కోట్ల బడ్జెట్ తోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అయితే థియేట్రికల్ బిజినెస్ కోటి రూపాయలకు జరిగితే ఇప్పుడు డిజిటల్ అండ్ శాటిలైట్ హక్కులకు మూడు కోట్లు వచ్చాయనే న్యూస్ బయటికి వచ్చింది.
యూవీ వారు తీసుకోవడంతోనే...
మరి ఈ లెక్కన హ్యాపీ వెడ్డింగ్ ఆడకపోయినా నిర్మతలు అంటే యువి బ్యానర్ వారికి ఏమాత్రం బాధ లేదు. మరి ప్రభాస్ చలవో మరేదన్నా కానివ్వండి ఈ సినిమాని యువీ క్రియేషన్స్ వారు టేకప్ చెయ్యడం మూలంగానే ఈ మాత్రం డిజిటల్, శాటిలైట్ హక్కులకు ధర వచ్చింది. లేదంటే ఈ సినిమాకి పెట్టిన మూడు కోట్లు కూడా వచ్చేవి కాదంటున్నారు. ఏది ఏమైనా నిహారికకు మాత్రం బ్యాడ్ లక్కే. పాపం ఆమె నటించిన ఏ సినిమా కూడా పెద్దగా ఆడకుండా ఇలా సో సో గానే మిగిలిపోతుంది.