Mon Dec 23 2024 07:57:43 GMT+0000 (Coordinated Universal Time)
హరిహర వీరమల్లు "పవర్ గ్లాన్స్" కు టైం ఫిక్స్
వినాయకచవితి సందర్భంగా పవర్ గ్లాన్స్ కు టైం ఫిక్సయింది అంటూ చిత్రయూనిట్ ట్వీట్ చేసింది. పవన్ పుట్టినరోజు కానుకగా..
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తోన్న తాజా సినిమా హరిహర వీరమల్లు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పూర్తి పీరియాడికల్ ఫిక్షన్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం పవన్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో పవన్ నెవర్ బిఫోర్ పాత్రలో నటిస్తుండటంతో.. అంచనాలు ఓ రేంజ్ లో క్రియేట్ అయ్యాయి. ఇప్పటి వరకూ ఈ సినిమా నుంచి కేవలం ఫస్ట్ లుక్ పోస్టర్స్ మాత్రమే విడుదలచేసింది చిత్రయూనిట్. ఎంతోకాలం నుంచి హరిహర వీరమల్లు అప్డేట్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు పవన్ పుట్టినరోజు సందర్భంగా.. అదిరిపోయే ట్రీట్ ఇచ్చేందుకు చిత్రయూనిట్ సిద్ధమైంది.
వినాయకచవితి సందర్భంగా పవర్ గ్లాన్స్ కు టైం ఫిక్సయింది అంటూ చిత్రయూనిట్ ట్వీట్ చేసింది. పవన్ పుట్టినరోజు కానుకగా సెప్టెంబర్ 2న సాయంత్రం 5.45 గంటలకు పవర్ గ్లాన్స్ విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ ప్రకటనతో ప్రేక్షకులు, అభిమానుల్లో ఆతృత పెరిగింది. పవర్ గ్లాన్స్ ఎలా ఉండబోతుంది ? ఏ రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పవర్ గ్లాన్స్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందంటూ నెట్టింట్లో హంగామా చేస్తున్నారు. PowerGlance హ్యాష్ టాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. ఈ సినిమాలో పవన్ సరసన నిధి అగర్వాల్ నటిస్తుండగా.. నిర్మాత ఏఎం రత్నం భార్జీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.
Next Story