Wed Apr 16 2025 05:05:22 GMT+0000 (Coordinated Universal Time)
రవితేజకు 56.. హీరోయిన్ కు 25 అంటూ కామెంట్.. డైరెక్టర్ హరీష్ శంకర్ ఏమన్నారంటే?
ఆయన సినిమాల్లో తీసుకుంటున్న హీరోయిన్ల ఏజ్ గురించి విమర్శలు

టాలీవుడ్ హీరో రవితేజ వరుసగా సినిమాలను చేస్తూ వెళుతున్నారు. అయితే ఆయన సినిమాల్లో తీసుకుంటున్న హీరోయిన్ల ఏజ్ గురించి విమర్శలు వస్తున్నాయి. ధమాకాలో 'శ్రీలీల', ఈగల్ లో 'కావ్య థాపర్'.. ఇలా రవితేజ హీరోయిన్స్ సెలెక్షన్స్ పై కొందరు కావాలనే వ్యతిరేకతను ప్రచారం చేస్తూ వస్తున్నారు. గతంలో పలువురు హీరోలు తమ వయసులో సగం కంటే తక్కువ ఉన్న వారితో నటించారు. కేవలం సినిమాలో క్యారెక్టర్లను మాత్రమే చూడాలంటూ పలువురు దర్శక నిర్మాతలు గతంలో వివరణ కూడా ఇచ్చారు. అయితే రవితేజ విషయంలో మాత్రం ఒక నెగటివిటీని స్ప్రెడ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.
దర్శకుడు హరీష్ శంకర్ ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజతో కలిసి మిస్టర్ బచ్చన్ సినిమా కోసం పని చేస్తున్నారు. ఈ సినిమా బాలీవుడ్ హిట్ సినిమా రైడ్ కి రీమేక్. ప్రస్తుతం చిత్రబృందం ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. మేకర్స్ ఈ సినిమా నుండి 'సితార్' పాటను విడుదల చేశారు. పాట విజువల్స్ బాగున్నాయని పేరు రాగా.. కొంతమంది నెటిజన్లు రవితేజ తన వయస్సులో సగం అమ్మాయితో రొమాన్స్ చేస్తున్నాడని విమర్శించడం ప్రారంభించారు. దర్శకుడు హరీష్ పాటను చిత్రీకరించిన తీరుపై కూడా విమర్శలు గుప్పించారు.
“56 ఏళ్ల రవితేజ 25 ఏళ్ల భాగ్యశ్రీ బోర్స్తో కలిసి డ్యాన్స్ స్టెప్పులు వేశారు. చిత్రనిర్మాతలు నటి ముఖాన్ని చూపించడానికి కూడా అసలు ఇష్టం లేదేమో'' అని ట్వీట్ చేశారు. దీనిపై దర్శకుడు హరీష్ శంకర్ స్పందించారు. “Congratulations for the discovery.. i think you should apply for Nobel Prize… 👍👍 And pls continue objectifying film makers…. We welcome you” అంటూ హరీష్ శంకర్ రిప్లై ఇచ్చారు. మీరు కనుక్కున్న దానికి అభినందనలు.. మీరు నోబెల్ ప్రైజ్ కోసం దరఖాస్తు చేసుకోవాలని నేను భావిస్తున్నాను.. సినిమా నిర్మాతలను ఆబ్జెక్టిఫై చేయడం కొనసాగించండంటూ సమాధానం వచ్చింది.
Next Story