Mon Dec 23 2024 04:59:31 GMT+0000 (Coordinated Universal Time)
Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి హరీష్ శంకర్ అవుట్.. అట్లీ ఇన్..!
'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి హరీష్ శంకర్ తప్పుకున్నారా..? ఆ ప్లేస్ లోకి అట్లీ రాబోతున్నారా..?
Pawan Kalyan : 'గబ్బర్ సింగ్' వంటి బ్లాక్ బస్టర్ తరువాత పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కలయికలో తెరకెక్కుతున్న సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్'. ఆల్రెడీ లాంచ్ అయ్యి షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ.. ఒక షెడ్యూల్ ని పూర్తి చేసుకుంది. ఆ తరువాత షెడ్యూల్ ఎప్పుడు మొదలవుతుందని అభిమానులు ఎదురు చూస్తుంటే.. హరీష్ శంకర్ ఈ మూవీని పక్కన పెట్టి రవితేజతో కొత్త చిత్రాన్ని స్టార్ చేశారు.
దీంతో ఉస్తాద్ మూవీ ఆగిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే, తాజాగా పవన్ తమిళ దర్శకుడు అట్లీతో ఓ మూవీ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. త్రివిక్రమ్ ఈ చిత్రానికి మాటలు రాయబోతున్నట్లు తెలుస్తుంది. కాగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా.. తమిళంలో అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన 'తేరి'కి రీమేక్ రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అట్లీతో సినిమా వార్తలు వింటుంటే.. తేరిని ఉస్తాద్ భగత్ సింగ్ గా అట్లీనే రీమేక్ చేసే భాద్యతలు తీసుకున్నాడా అనే సందేహం కలుగుతుంది.
ప్రస్తుతం అట్లీ ఇదే చిత్రాన్ని బాలీవుడ్ లో వరుణ్ ధావన్ తో రీమేక్ చేస్తున్నారని సమాచారం. మరి పవన్ తో అట్లీ సినిమా ఎంత వరకు నిజమో తెలియాలంటే వేచి చూడాల్సిందే. అలాగే ఒకవేళ అది నిజమైతే.. ఉస్తాద్ భగత్ సింగ్ దర్శకత్వం బాధ్యతలే అట్లీ తీసుకోబోతున్నారా అనే విషయం పై కూడా క్లారిటీ రావాల్సి ఉంది. ఉస్తాద్ షూటింగ్ 10 శాతం కూడా పూర్తి కాలేదు. కాబట్టి హరీష్ శంకర్ ప్లేస్ లోకి అట్లీ వచ్చినా ఆశ్చర్య పోనక్కర్లేదు. అట్లీ రీసెంట్గా 'జవాన్' సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు.
Next Story