క్రిష్ కన్నా హరీష్ కంగారు ఎక్కువయ్యిందే!!
పవన్ కళ్యాణ్ తో సినిమా అంటే ఎవరికైనా ఎగ్జైట్మెంట్ ఉంటుంది. పవన్ రాజకీయాల్లోకి వెళ్లినా పవన్ క్రేజ్ సినిమాల్లో ఏమాత్రం తగ్గలేదు. అందుకే పవన్ కళ్యాణ్ తో [more]
పవన్ కళ్యాణ్ తో సినిమా అంటే ఎవరికైనా ఎగ్జైట్మెంట్ ఉంటుంది. పవన్ రాజకీయాల్లోకి వెళ్లినా పవన్ క్రేజ్ సినిమాల్లో ఏమాత్రం తగ్గలేదు. అందుకే పవన్ కళ్యాణ్ తో [more]
పవన్ కళ్యాణ్ తో సినిమా అంటే ఎవరికైనా ఎగ్జైట్మెంట్ ఉంటుంది. పవన్ రాజకీయాల్లోకి వెళ్లినా పవన్ క్రేజ్ సినిమాల్లో ఏమాత్రం తగ్గలేదు. అందుకే పవన్ కళ్యాణ్ తో సినిమా చెయ్యడానికి దర్శకనిర్మాతలు పోటీ పడుతున్నారు. పవన్ ఎవరిని కరుణిస్తాడో అంటూ ఎదురు చూస్తున్నారు. అయితే వకీల్ సాబ్ తర్వాత పవన్ కళ్యాణ్ క్రిష్ తో ఓ పిరియాడికల్ మూవీని, హరీష్ శంకర్ తో ఓ కమర్షిల్ మూవీ ని ఒప్పుకున్నాడు. అయితే పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా సెప్టెంబర్ 2 న వకీల్ సాబ్ నుండి ఓ టీజర్ ప్లాన్ చేసింది వకీల్ సాబ్ టీం.
ఇక తర్వాత క్రిష్ అప్ డేట్ వస్తుందేమో అనుకుంటే..క్రిష్ కన్నా ముందే హరీష్ శంకర్ లైన్ లోకోచ్చేసాడు. తాజాగా హరీష్ శంకర్ – పవన్ కాంబో మూవీ పై సెప్టెంబర్ 2 సాయంత్రం ఓ అప్ డేట్ రాబోతుంది అని నిర్మాతలు ఎనౌన్స్ చేసారు. అసలు పవన్ కళ్యాణ్ – క్రిష్ సినిమా కన్నా ఎక్కువగా హరీష్ శంకర్ – పవన్ కళ్యణ్ సినిమా ముచ్చట్లే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వకీల్ సాబ్ తర్వాత లైన్ లో ఉన్న క్రిష్ కన్నా ముందే హరీష్ తన సినిమా విషయంలో కంగారు పడుతున్నట్లుగా కనబడుతుంది. మరి పవన్ కళ్యాణ్ క్రిష్ సినిమా పక్కనబెట్టి హరీష్ తో ముందుకెళ్లాలని అనుకున్నాడేమో అందుకే హరీష్ పవన్ సినిమా స్క్రిప్ట్ ని పూర్తి చేసి పవన్ కోసం ఇలా హడావిడి చేస్తున్నాడేమో అంటున్నారు.
- Tags
- pawan kalyan