Mon Dec 23 2024 07:05:58 GMT+0000 (Coordinated Universal Time)
Vyuham : వ్యూహం సినిమాపై విచారణ 28కి వాయిదా
వ్యూహం సినిమా విడుదలపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఈనెల 28వ తేదీకి విచారణను వాయిదా వేసింది
వ్యూహం సినిమా విడుదలపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. వ్యూహం సినిమా విడుదల నిలుపుదల చేయాలంటూ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. అయితే దీనిపై విచారించిన హైకోర్టు విచారణను ఈ నెల 28వ తేదీకి వాయిదా వేసింది. 28వ తేదీన ఈ పిటీషన్ పై విచారించి తగిన నిర్ణయం తీసుకుంటామని హైకోర్టు తెలిపింది. సినిమా విడుదలపై స్టే ఇవ్వాలని పిటీషన్ కోరగా అందుకు న్యాయస్థానం తిరస్కరించింది.
జగన్ కథాంశంతో...
వ్యూహం సినిమాకు ప్రముఖ సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కథాంశంగా ఈ సినిమా రూపుదిద్దుకుంది. జగన్ పై ఎన్ని కుట్రలు జరిగింది? ఎన్నికల్లో ఎలా విజయం సాధించింది? ప్రత్యర్థులు ఎలాంటి ఆటంకాలు కల్పించారన్న దానిపై ఈ సినిమా రూపుదిద్దుకోవడంతో ఈ సినిమా విడుదలపై టీడీపీ అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తునారు. ఏపీ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ఇలా సినిమాల ద్వారా ప్రజలను ప్రభావితం చేయాలని చూడటం సరికాదని టీడీపీ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
Next Story