Mon Dec 15 2025 06:28:11 GMT+0000 (Coordinated Universal Time)
నాని "దసరా" కోసం భారీ విలేజ్ సెట్.. ఖర్చెంతయిందో తెలుసా ?
"దసరా" సినిమాలో నాని కాస్త డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నట్లు టాక్. పూర్తి తెలంగాణ యాసలో నాని భాష ఉంటుందని తెలుస్తోంది.

నేచురల్ స్టార్ నాని నటించిన శ్యామ్ సింగరాయ్ ఊహించని భారీ విజయాన్ని అందుకుంది. ఇక తర్వాతి సినిమాలతో నాని బిజీ బిజీ ఉంటున్నాడు. "అంటే సుందరానికీ" సినిమా ఇటీవలే షూటింగును పూర్తి చేసుకుంది. ఈ సినిమాను వివేక్ ఆత్రేయ రూపొందించగా.. నజ్రియా నజీమ్ తెలుగుతెరకి హీరోయిన్ గా పరిచయమవుతోంది. ఇక నాని మరో సినిమా "దసరా" ప్రస్తుతం సెట్స్ పై ఉంది. చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయమవుతుండగా.. కీర్తి సురేష్ మరోసారి నానికి జతకడుతోంది.
"దసరా" సినిమాలో నాని కాస్త డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నట్లు టాక్. పూర్తి తెలంగాణ యాసలో నాని భాష ఉంటుందని తెలుస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్ డేట్ వైరల్ అవుతోంది. "దసరా" సినిమా కోసం హైదరాబాద్ లోని శివారు ప్రాంతంలో 12 ఎకరాల్లో భారీ విలేజ్ సెట్ నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ భారీ సెట్ కోసం అక్షరాలా రూ.12 కోట్లు ఖర్చుపెడుతున్నట్లు సమాచారం. "దసరా" షూటింగ్ ఎక్కువ భాగం ఈ సెట్ లోనే జరగనున్నట్లు చెప్పుకుంటున్నారు సినీ జనాలు. ఇందులో నిజమెంతుందో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.
News Summary - Heavy Village set for Nani's Dasara Movie
Next Story

