Wed Jan 01 2025 20:16:02 GMT+0000 (Coordinated Universal Time)
ఎమోషనల్ అయిన హేమ.. 'మా' క్షమించేనా?
బెంగళూరులో రేవ్ పార్టీ కేసులో బెయిల్పై విడుదలైన నటి హేమ, తన సభ్యత్వాన్ని పునరుద్ధరించుకోవడానికి
బెంగళూరులో రేవ్ పార్టీ కేసులో బెయిల్పై విడుదలైన నటి హేమ, తన సభ్యత్వాన్ని పునరుద్ధరించుకోవడానికి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు మంచు విష్ణును కలిశారు. బెంగళూరులో రేవ్ పార్టీ డ్రగ్స్ కేసులో హేమ అరెస్టయిన తర్వాత MAA హేమ సభ్యత్వాన్ని రద్దు చేసింది. ముందుగా తనకు షోకాజ్ నోటీసు అందించకుండా లేదా ఆమె వెర్షన్ను పరిగణనలోకి తీసుకోకుండా MAA హడావిడిగా తీర్మానం చేసిందని హేమ ఆరోపించారు. ఇప్పుడు తాను ఆ కేసు నుండి బయటపడ్డానని.. తన సభ్యత్వాన్ని పునరుద్ధరించాలని MAA ను కోరింది.
చిరంజీవికి కూడా లేఖ:
నటి హేమ మే 19వ తేదీ రాత్రి బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని జిఆర్ ఫామ్హౌస్లో జరిగిన రేవ్ పార్టీకి హాజరయ్యారు. హేమ రక్త నమూనాలను పరీక్షించిన తర్వాత నిషేధిత పదార్థాన్ని ఆమె వినియోగించినట్లు ఆరోపణలు వచ్చాయి. హేమను పరప్పన అగ్రహార జైలుకు తరలించి బెయిల్పై విడుదల చేశారు. తాను ఎలాంటి డ్రగ్స్, నిషేధిత పదార్థాలు తీసుకోలేదని ఆమె చెబుతూ వస్తున్నారు. తాజాగా హేమ.. మంచు విష్ణు, మా వ్యవస్థాపకుడు మెగాస్టార్ చిరంజీవికి సుదీర్ఘ లేఖ రాశారు. తనకు సంబంధం లేని విషయాలను ఆపాదించి విలన్గా చూపించే ప్రయత్నం చేశారని హేమ తెలిపారు. మీడియా ఒత్తిడి మేరకు నన్ను సస్పెండ్ చేయడం, నా ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమే అవుతుందన్నారు. తీవ్రమైన మానసిక క్షోభతో ఉన్న ఈ సమయంలో, నాకు MAA మద్దతు అవసరం. తక్షణమే నా సస్పెన్షన్ ఎత్తివేస్తారని ఆశిస్తున్నానని హేమ లేఖ రాశారు. ఈ లేఖపై MAA అధ్యక్షుడు మంచు విష్ణు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
Next Story